కోహ్లిని రనౌట్ చేసే ఛాన్స్ వచ్చినా..
ముంబై: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లికి అదృష్టం కలిసొచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా స్కోరు వికెట్ నష్టానికి 68 పరుగుల వద్ద ఉండగా కోహ్లి రెండు సార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అది కూడా ఒకే బంతికి కావడం ఇక్కడ గమనార్హం.
ఇన్నింగ్స్ తొమ్మిది ఓవర్ లో భాగంగా బ్రేవో వేసిన మూడో బంతి నోబాల్ అయ్యింది. దీంతో ఫ్రీ హిట్ అయిన ఆ బంతిని బ్రేవో ఆఫ్ స్టంట్ కొద్దిగా దూరంగా వేయడంతో కీపర్ రామ్ దిన్ చేతుల్లోకి వెళ్లింది. అయితే అప్పటికే క్రీజ్ వదిలి బయట ఉన్న విరాట్ ను రనౌట్ చేద్దామని రామ్ దిన్ ప్రయత్నించినా సఫలం కాలేదు. అదే బంతికి బౌలర్ ఎండ్ లో ఉన్న బ్రేవ్ పరుగొత్తుకొచ్చి మరోసారి రనౌట్ చేయడానికి యత్నించినా అది కూడా వికెట్లకు దూరంగా వెళ్లింది. దీంతో విరాట్ కు వరుసగా రెండు లైఫ్లు లభించాయి. అప్పటికి విరాట్ వ్యక్తిగత స్కోరు ఒక పరుగు మాత్రమే. ఆ తరువాత విరాట్ (89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) దాటిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 192 భారీ పరుగులు నమోదు చేసింది