విండీస్ ఫీల్డింగ్: భారత్ బ్యాటింగ్
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా గురువారం వాంఖేడే స్టేడియంలో భారత్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ తొలుత ధోని సేనను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం తర్వాత కోలుకొని భారత్ సెమీస్‌కు చేరగా...మూడు విజయాలతో సెమీస్ స్థానం సంపాదించాక అఫ్ఘానిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమితో వెస్టిండీస్ ఈ మ్యాచ్‌కు వచ్చింది.
భారత జట్టులో కాలి మడమ గాయంతో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చాడు. అయితే పేలవమైన ఫామ్తో నిరాశపరుస్తున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో అజింక్యా రహానేకు స్థానం కల్పించారు. భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఇప్పటివరకూ జరిగిన 4 టి20 మ్యాచ్‌ల్లో చెరో రెండు గెలిచాయి. ప్రపంచకప్‌లలో మూడు ఆడగా... భారత్ ఒకటి గెలిచి, రెండు ఓడింది.