అనుష్క చేసిన తప్పేంటి?: గంగూలీ | What wrong Anushka Sharma has done, says Sourav Ganguly | Sakshi

అనుష్క చేసిన తప్పేంటి?: గంగూలీ

Mar 27 2015 1:53 PM | Updated on Sep 2 2017 11:28 PM

అనుష్క చేసిన తప్పేంటి?: గంగూలీ

అనుష్క చేసిన తప్పేంటి?: గంగూలీ

విరాట్ కోహ్లి వైఫల్యానికి అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణమంటూ వస్తున్న విమర్శలను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు.

సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో విరాట్ కోహ్లి వైఫల్యానికి అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణమంటూ వస్తున్న విమర్శలను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. అపరిపక్వతతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డాడు. అనుష్కపై ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించేవిగా ఉన్నాయన్నాడు.

' అనుష్క చేసిన తప్పేంటి. ఇతర ఆటగాళ్ల కుటుంబ సభ్యుల మాదిరిగానే సిడ్నీ మ్యాచ్ చూడడానికి వచ్చింది. కోహ్లి వైఫల్యానికి ఆమెను నిందించడం సరికాదు. విమర్శకుల అపరిపక్వతకు ఇది నిదర్శనం' అని గంగూలీ వ్యాఖ్యానించాడు. కోహ్లి, అనుష్క ప్రేమించుకోవడం తప్పుకాదని అన్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన వరల్డ్ కప్ సెమీస్ ఫైనల్లో కోహ్లి(1) విఫలమవడంతో అనుష్క శర్మపై ట్విటర్ లో విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement