
సిడ్నీ చేరిన అనుష్క
సిడ్నీ: బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లి ప్రియురాలు అనుష్క శర్మ కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. సిడ్నీలో గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ లో సందడి చేయనుంది. తన బాయ్ ఫ్రెండ్, టీమిండియాకు మద్దతిచ్చేందుకు అమ్మడు ఇక్కడ వాలింది. ధోని సేన సెమీస్ చేరడంతో ఆటగాళ్లతో ఉండేందుకు వారి భార్యలు, ప్రియురాళ్లకు బోర్డు అనుమతిచ్చింది.
ఆసీస్ లో దిగిన అనుష్క ప్రియుడితో కలిసి షికార్లు చేసేస్తోందని టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ తో కలిసి ఈ ప్రేమజంట భారతీయ రెస్టారెంట్ లో భోజనానికి వెళ్లిందట. 'ఎన్ హెచ్ 10' సినిమాలో అనుష్క నటనను స్టాఫ్ సభ్యులు ఈ సందర్భంగా ప్రశంసించారట. ఇదిలావుంచితే టీమిండియా కోహ్లి భారీ ఇన్నింగ్స్ బాకీవున్నాడు. ప్రియురాలి సమక్షంలో ఈ 'ఛేజింగ్ స్టార్' చెలరేగి ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సిడ్నీ స్టేడియంలో ప్రియురాలిపై ఫ్లయింగ్ కిస్‌లు కురిపించే ఛాన్స్ విరాట్ కు వస్తోందో, లేదో చూడాలి.