న్యూఢిల్లీ: జీవితం కంటే ఏది విలువైనది కాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా స్పష్టం చేశాడు. ఒకవైపు కరోనా వైరస్ అందర్నీ కలవర పరుస్తూ ఉంటుంటే కొంతమంది ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. దీన్ని ఉద్దేశించి మాట్లాడిన రైనా,.. మన జీవితాలు ముందు బాగుంటేనే.. మిగతా అంశాలు గురించి ఆలోచించ గలమన్నాడు. (బీసీసీఐ విరాళం రూ. 51 కోట్లు)
‘ జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు.. మన జీవితాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని కంటే కూడా ముందు నీ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఐపీఎల్ కోసం మనం నిరీక్షించడం ఒక్కటే మార్గం. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనం ఆ సంక్షోభం నుంచి బయటపడాలి’ అని రైనా పేర్కొన్నాడు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌కు అంతా సహకరించాలన్నాడు. మనల్ని మనం రక్షించుకోవడమే మనముందున్న మార్గమన్నాడు. అందుకు సాధ్యమైనంత వరకూ ఇంట్లో ఉండటమే ఉత్తమ మార్గమని రైనా తెలిపాడు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా రైనా రూ. 52 లక్షలను విరాళంగా ప్రకటించాడు. (సురేశ్ రైనాకు పుత్రోత్సాహం)
గత నెలలో రైనా రెండోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రియాంక.. బాబుకు జన్మనిచ్చింది. అతనికి రియో రైనాగా నామకరణం చేశాడు. అంతకుముందు ఈ జంట గ్రేసియా రైనాకు జన్మనివ్వగా, గత నెల చివరి వారంలో బాబుకు జన్మనిచ్చారు. బాబు రియో పుట్టినందుకు వేడుక జరుపుకోవాలనుకున్నాడు రైనా. కగా, ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలో జరుపుకోవడానికి సరైన సమయం కాదని దాన్ని వాయిదా వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment