అసలు నువ్వెవరు?
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ ఎవరో తనకు తెలియదంటూ రష్యన్ టెన్నిస్ స్టార్ షరపోవా వ్యాఖ్యానించడంపై మాస్టర్ అభిమానులు విరుచుకుపడ్డారు. అసలు షరపోవా ఎవరంటూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో దుమ్మెత్తి పోశారు. షరపోవా ట్విట్టర్ అకౌంట్‌లో ఏనాడూ లేని స్థాయిలో ట్వీట్స్ వెల్లువెత్తాయి.
‘దేవుడినే గుర్తు పట్టదా? ఆమెకు బుద్ది చెప్పాల్సిందే’ అని ఓ ఫ్యాన్ ఆవేశం ప్రదర్శిస్తే... ‘స్విట్జర్లాండ్‌లో క్రికెట్ ఆడకపోయినా ఫెడరర్ ఎంతో వినయంతో సచిన్‌తో మాట్లాడతాడు. రష్యాలో క్రికెట్ ఆడరనే సాకుతో సచిన్ తెలియదని వ్యాఖ్యానించడం మూర్ఖత్వం’ అంటూ మరో అభిమాని విరుచుకుపడ్డాడు. దీనికి ప్రతిగా ‘పుతిన్ ఎవరో నాకు తెలియదని మోడి చెప్పాలి’ అని ఓ అభిమాని రాశాడు.