ముందే ఎందుకు రాలేదో! | why did not come before | Sakshi

ముందే ఎందుకు రాలేదో!

Mar 27 2015 1:00 AM | Updated on Sep 2 2017 11:26 PM

ముందే ఎందుకు రాలేదో!

ముందే ఎందుకు రాలేదో!

కళ్ల ముందు భారీ లక్ష్యం కనబడుతోంది. 20 ఓవర్లు కూడా ముగియకముందే టాప్-3 బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. మరి ఈ దశలో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను ఎవరు తీసుకోవాలి.

కళ్ల ముందు భారీ లక్ష్యం కనబడుతోంది. 20 ఓవర్లు కూడా ముగియకముందే టాప్-3 బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. మరి ఈ దశలో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను ఎవరు తీసుకోవాలి. అనుభవజ్ఞుడైన ధోనియా? లేక పవర్ హిట్టర్ రైనానా? ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. 2011 ప్రపంచకప్ ఫైనల్లో భీకరమైన ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ను కాదని ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చాడు. చివరి వరకు ఇన్నింగ్స్‌ను నడిపి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
 
మరి ఈసారి అలా ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయాడు? మామూలుగా 20 ఓవర్లప్పుడు క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేసే సత్తా రైనాకు లేదనే విషయం చాలాసార్లు రుజువైంది. చివరి 10 ఓవర్లలో ధాటిగా పరుగులు చేయడంలో మాత్రమే అతను దిట్ట.
 

టాప్-5 బ్యాట్స్‌మెన్ అవుటైన తర్వాత ధోని క్రీజులోకి వస్తే... అతనికి సరైన సహకారం అందించడానికి నాణ్యమైన బ్యాట్స్‌మన్ జడేజా మినహా మరెవరూ లేరు. బౌలర్లతో భారీ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపుగా అసాధ్యం కూడా. మరి ఇలాంటి స్థితిలో రైనా కంటే ధోని ముందుగా బ్యాటింగ్‌కు వస్తే సెమీస్ మ్యాచ్‌లో భారత్ అవకాశాలు కాస్త అయినా మెరుగ్గా ఉండేవేమో! మరి ఈసారి ధోని ఎందుకు అలాంటి ప్రయోగం చేయలేకపోయాడో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement