బీసీసీఐ
చెన్నై/తిరువనంతపురం: క్రికెట్ అభివృద్ధికి విశేష కృషి చేస్తానని బీసీసీఐ కొత్త వైస్ ప్రెసిడెంట్ టీసీ మాథ్యూ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...వైస్ ప్రెసిడెంట్ పదవిని ఉపయోగించి కేరళలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. "నేను వెస్ట్ జోన్ నుంచి ఎన్నికైనప్పటికీ కేరళలో క్రికెట్ అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తా"నని ఆయన తెలిపారు. చెన్నైలో జరిగిన 85వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 30 ఓట్లు పోలవగా మాథ్యూకు 16 ఓట్లు వచ్చాయి. కొత్తగా ఎన్నికైన మాథ్యూ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కు సన్నిహితుడు. ఈ ఎన్నికల్లో మాథ్యూ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ కు సన్నిహితుడైన రవిసావంత్ ను ఓడించారు. ఆయన 1997-2005 మధ్యకాలంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గా, 2005-2014 మధ్యకాలంలో సెక్రటరీగా సేవలందించారు.