రాజ్‌కోట్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగుల వద్ద ఆలౌటైంది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా 94/6 ఓవర్‌నైట్ స‍్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్.. మరో 87 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు రోస్టర్ ఛేజ్(53) హాఫ్ సెంచరీతో మెరవగా, కీమో పాల్(47) సైతం ఆకట్టుకున్నాడు.
ఈ జోడి ఏడో వికెట్‌కు 73 పరుగులు జోడించిన తర్వాత పాల్ ఔట్ కాగా, ఆపై కాసేపటికి ఛేజ్ కూడా పెవిలియన్ చేరాడు. అటు తర్వాత లూయిస్(0), గాబ‍్రియల్(1)లు స్వల వ్యవధిలోనే ఔట్ కావడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు తలో వికెట్ తీశారు. అంతకముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో కోహ్లి గ్యాంగ్ 468 పరుగుల ఆధిక‍్యంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment