విండీస్‌ మెరిసె... | Windies won by 21 runs | Sakshi
Sakshi News home page

విండీస్‌ మెరిసె...

Published Mon, Sep 18 2017 12:45 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

Windies won by 21 runs

చెస్టర్‌ లె స్ట్రీట్‌: ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో విండీస్‌ జట్టు 21 పరుగుల తేడాతో గెలిచింది. ఎవిన్‌ లూయిస్‌ (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్‌ గేల్‌ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో... విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గేల్‌ అంతర్జాతీయ టి20ల్లో 100 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. హేల్స్‌ (17 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే ఆకట్టుకున్నాడు. బ్రాత్‌వైట్, విలియమ్స్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement