వరల్డ్ మైండ్ గేమ్స్
బీజింగ్: వరల్డ్ మైండ్ గేమ్స్ చెస్ ఈవెంట్‌లో పాల్గొన్న తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక నిరాశ పరిచారు. ర్యాపిడ్ ఈవెంట్‌లో ఈ ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు కనీసం టాప్-10లో నిలువలేకపోయారు. ఏడు రౌండ్‌లపాటు జరిగిన ఈ టోర్నీలోని పురుషుల విభాగంలో హరికృష్ణ 2.5 పాయింట్లతో 14వ స్థానంలో... మహిళల విభాగంలో 3 పాయింట్లతో హారిక 12వ స్థానంలో, 2 పాయింట్లతో హంపి 15వ స్థానంలో నిలిచారు. ఐదో రౌండ్‌లో హారిక, హంపిలు ముఖాముఖిగా తలపడగా... 46 ఎత్తుల్లో ఈ గేమ్ ‘డ్రా’గా ముగిసింది.
పురుషుల, మహిళల విభాగాల్లో 16 మంది చొప్పున ఈ టోర్నీలో పాల్గొన్నారు. మహిళల విభాగంలో 5.5 పాయింట్లతో వాలంటీనా గునీనా (రష్యా), పురుషుల విభాగంలో 5 పాయింట్లతో అలెగ్జాండర్ గ్రిస్చుక్ (రష్యా) స్వర్ణ పతకాలను సాధించారు. ఇదే టోర్నీలో బ్లిట్జ్ ఈవెంట్ గేమ్‌లు శనివారం ప్రారంభమవుతాయి.
మనోళ్లకు నిరాశ
Published Sat, Dec 13 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement