అవును... మేం పెళ్లి చేసుకుంటున్నాం: యువరాజ్ | yes we want married - yuvi | Sakshi
Sakshi News home page

అవును... మేం పెళ్లి చేసుకుంటున్నాం: యువరాజ్

Published Sun, Nov 15 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

అవును... మేం పెళ్లి చేసుకుంటున్నాం: యువరాజ్

అవును... మేం పెళ్లి చేసుకుంటున్నాం: యువరాజ్

నటి, మోడల్ హాజెల్ కీచ్‌తో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని యువరాజ్ సింగ్ తొలిసారి స్వయంగా ఖరారు చేశాడు. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. ‘అవును, మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. హాజెల్ రూపంలో నా జీవిత కాల స్నేహితురాలిని పొందాను. అంతా తన పోలికే అని అమ్మ కూడా చెప్పింది’ అని యువీ ట్వీట్ చేశాడు.

ఇటీవల ఇండోనేసియాలోని బాలిలో వీరిద్దరి మధ్య నిశ్చితార్థం జరిగినట్లు ఫొటోలు, వార్తలు వచ్చినా యువీ వీటిని ముందుగా ఖండించాడు. అయితే అతని తండ్రి యోగ్‌రాజ్ సింగ్ పెళ్లి విషయాన్ని నిర్ధారించారు. వచ్చే ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement