
గ్రేటర్ నోయిడా: ప్రస్తుత కబడ్డీ సీజన్ ప్లే ఆఫ్స్‌కు యూపీ యోధ అర్హత సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్‌కు పోటీ పడుతున్న జైపూర్ పింక్ పాంథర్స్ ఆశలు ఆవిరయ్యాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 50–33తో దబంగ్ ఢిల్లీపై ఘన విజయం సాధించింది. మోను (11 పాయింట్లు), శ్రీకాంత్ (9 పాయింట్లు) రాణించడంతో యూపీ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 39–33తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment