యోగాకు క్రీడగా గుర్తింపు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్శిస్తున్న యోగాకు ఇక నుంచి క్రీడగా గుర్తింపునిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి ‘ప్రయారిటీ’ విభాగంలో చోటిచ్చింది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో ఈ క్రీడను ‘ఇతర’ క్రీడల విభాగం నుంచి ‘జనరల్’కు మార్చారు. అంతేకాకుండా ప్రయారిటీ కేటగిరీలో ఫెన్సిం గ్‌కు యూనివర్సల్ స్పోర్ట్స్ కింద చోటిచ్చారు. వివిధ క్రీడా విభాగాల వర్గీకరణను మంగళవారం కేంద్ర క్రీడా శాఖ సమీక్షించింది.
దీంట్లో భాగంగా జనరల్ కేటగిరీలో ఉన్న క్రీడలన్నీ అదే విభాగంలో ఉంచుతున్నట్టు తెలిపింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తదితర మెగా ఈవెంట్స్ బరిలో ఉండే క్రీడలను జనరల్ కేటగిరీగా పరిగణించేందుకు క్రీడా శాఖ నిర్ణయించింది.