ముంబై: ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత వరల్డ్‌కప్ జట్టు ఎంపిక ఉండదని ఇప్పటికే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేయగా, దానికి తాజాగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మద్దతు పలికాడు. ఐపీఎల్‌లో ప్రదర్శన అనేది వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయబోయే జట్టుకు ఎంతమాత్రం ప్రామాణికం కాదని తేల్చిచెప్పాడు. వరల్డ్‌కప్‌కు జట్టును ఎంపిక చేసే క్రమంలో గత కొంత కాలంగా భారత ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందనే దానిపైనే ఎంపిక ఉంటుందని, వారు ఐపీఎల్‌లో ఎలా ప్రదర్శన చేసారనేది ఇక్కడ పరిగణిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు.
‘ఐపీఎల్ అనేది మెగాటోర్నీకి ఎంపికకు కొలమానం కాదు. గత నాలుగేళ్లలో భారత జట్టు సాధ్యమైనన్ని వన్డేలు, టీ20లు ఆడింది. అది వరల్డ్‌కప్‌కు ఎంపికకు సరిపోతుంది. అంతేకానీ ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టు ఎంపిక ఉండబోదు. ఐపీఎల్ అనేది బంతికి బ్యాట్‌కు జరిగే ఒక ప్రత్యేకమైన గేమ్. ఇదొక ఫ్రాంఛైజీ క్రికెట్ అనేది వాస్తవం. ఇందులో ఫామ్ ఆధారంగా వరల్డ్‌కప్‌కు వెళ్లబోయే జట్టును ఎంపిక చేసే పరిస్థితి ఉండదు’ అని రోహిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment