ఎ- డివిజన్ వన్డే లీగ్
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో పీఎస్ యంగ్‌స్టర్స్ బౌలర్ నరసింహా (6/18) అద్భుతంగా రాణించాడు. దీంతో సోమవారం మణికుమార్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యంగ్‌స్టర్స్ జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్‌స్టర్స్ జట్టు 38.3 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. మణికుమార్ బౌలర్లలో సంజయ్ 3, భరత్ 4 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మణికుమార్ జట్టు నరసింహ ధాటికి 30.3ఓవర్లలో 54 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
ఇతర మ్యాచ్‌ల వివరాలు
భారతీయ సీసీ:64 (పవన్ 3/20, విజయ్ 3/19, రాము 3/1); కాకతీయ సీసీ: 66/3 (8.1 ఓవర్లలో)
మహేశ్ సీసీ:104 (అశ్విన్ 41, అఫ్రోజ్ 3/21, మణికంఠ 4/27); రుషిరాజ్ సీసీ: 104/9 ( షేక్ దాదర్ 34; నరేశ్ 3/13).
లాల్‌బహదూర్ పీజీ: 132 (దినేశ్ 38; మోయిజ్ 3/26); అజాద్ సీసీ: 134 /4 (హుస్సేన్ 32, బద్రి 54; దినేశ్ 3/37)
భారతీయ సీసీ: 186/9 (పృథ్వీ రాజ 34, చంద్రశేఖర్ 75నాటౌట్; శ్రీకాంత్ 3/22); విజయపురి విల్లోమెన్: 187/1 (మురళి 90, షాకిర్ అహ్మద్ 88నాటౌట్)
నవజీవన్ ఫ్రెండ్స్: 145 (ఆర్యన్ 32, గిరిబాబు 32; షహనాజ్ 3/36); ఆడమ్స్ ఎలెవన్: 143 (సచిన్ 64 నాటౌట్; గిరిబాబు 3/26)
సదరన్ స్టార్: 124/7 (సత్య 34; రిత్విక్ 3/20); తిరుమల సీసీ: 125/2 (ధనుంజయ్ 53, రిత్విక్ 47నాటౌట్)
రోషనారా: 176 ( అనిల్ 52నాటౌట్; అనిరుధ్ 4/35);టీమ్ కున్: 23/1 (7 ఓవర్లలో)
సౌతెండ్ రేమండ్‌స: 117 (37.3ఓవర్లలో);మయూర్ సీసీ: 74 (27.5 ఓవర్లలో)
ఎస్‌కే బ్లూస్ 179 ( ముస్తాక్ 41, దీపాంకర్ 31); విక్టరీ సీసీ: 180/3 (శ్రేయస్ 48, రోహిత్ సాగర్ 84)
ఇంపీరియల్ సీసీ: 65 (అజ్మీర్3/13, వినయ్3/15); కిషోర్ సన్‌స:66 ( చిరాగ్ పటేల్ 32నాటౌట్)
రోషనార: 230/5 (నయన్ 51, ఉదయ్ 32, శ్రీకాంత్ 89; జకారియా 3/39);విక్టోరియా సీసీ: 67 ( అక్బర్ 3/15; విజయ్ 4/9)
డెక్కన్ కోల్ట్స్:258/9 (మణిదీప్ 73, నరేందర్39); గ్రీన్‌లాండ్‌స: 122 (అనుజ్ 40; రాజీవ్ 3/30)
సట్టన్ సీసీ: 65 (విజయ్ 3/13, పవన్ 3/13, రుద్రశివ 3/13);సాత్విక్ యూనియన్: 66/1 (అగ్రజ్ 48నాటౌట్)
యంగ్ సిటిజన్: 226/8 (హన్మంత్ 39; హర్ష్ 4/62); సఫిల్‌గూడ: 85 (సారుు 3/8, అంకిత్ రామ్ 4/21).