youngsters team
-
బంగారంలాంటి ఆలోచన
బంగారు ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారుల జీవితాలు బంగారమయంగా ఉన్నాయా.. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడమే కాదు వారికి సాయం చేయాలనే ఆలోచనతో పాతికేళ్ల లోపు యంగ్‌స్టర్స్ స్వచ్ఛందంగా వారిని కలిసి, ఆభరణాలను తయారుచేయించి హైదరాబాద్ తెల్లాపూర్‌లో ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గ్లోబలైజేషన్లో భాగంగా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు, కంప్యూటర్ డిజైన్స్ వచ్చాక స్వర్ణకారుల ప్రాభవం మసకబారిపోతోందని, వారి కళను బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నమిదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వీరిలో శ్రీహర్షిత, ప్రద్యుమ్న, రిత్విక్, ప్రకృతి, సంస్కృతి, సర్వనా, సాత్విక్, భరణ్య, అజయ్, భగీరథ్ లు ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి వీరితో మాట్లాడినప్పుడు స్వర్ణకారుల కళ, వారి శ్రమకు తగిన ఫలం రాబోయే రోజుల్లో మరింతగా పెరగాలని కోరుకున్నారు. స్వర్ణకారులు తయారుచేసిన ఆభరణాల ప్రదర్శనకు ముందుండి నడిచిన చాడా శ్రీహర్షిత లా పూర్తి చేసి, తెలంగాణలోని ‘బచ్పన్ బచావో ఆందోళన్’కి లీగల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తోంది. భరణ్య లా చదువుతోంది. రుత్విక్ డాక్టర్ కాగా స్వాతిక్ లా చేస్తున్నాడు. ప్రకృతి పన్నెండవ తరగతి పూర్తిచేసి సైకాలజీ పట్టా పొందడానికి కృషి చేస్తోంది. ప్రద్యుమ్న, భగీరథ్లు బీటెక్ చేస్తున్నారు. ఇక సర్వనా, సంస్కృతి లు స్కూల్ ఏజ్‌లోనే ఉన్నారు. నేరుగా కలిసి.. తాము చేస్తున్న కార్యక్రమాల గురించి శ్రీహర్షిత మాట్లాడుతూ ‘ఎడిస్టీస్ ఎన్జీవోని కిందటేడాది ప్రారంభించాం. దీని ద్వారా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మంచి మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తుంటాం. ఇందుకు కర్నూలు వాసి అయిన నర్మదా టీచర్ ప్రెసిడెంట్‌గా ఉండి సరైన సూచనలు ఇస్తుంటారు. స్కూల్ కార్యక్రమాల తక్వాత హస్తకళలకు సాయం చేయాలనే ఆలోచన చేసినప్పుడు స్వర్ణకారుల జీవితాలను చూశాం. మూడు నెలల క్రితం అనుకున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాం’ అని వివరిస్తే.. ‘దాదాపు పాతికమంది స్వర్ణకారుల కుటుంబాలను నేరుగా కలిసి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, ఒక డాక్యుమెంటరీ రూపొందించాం. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులను కలిసి, స్వర్ణకారుల జీవితాల గురించి తెలియజేశాం. మేం ఏ కార్యక్రమం చేసినా, అందులో ప్రతీసారి కొత్తవారు సభ్యులు అవుతూ ఉంటారు. దీంతో మరికొందరికి సాయం చేయాలన్న ఆలోచన కూడా పెరుగుతోంది’ అని వివరించింది భరణ్య. శ్రమ ఎక్కువ.. ఆదాయం తక్కువ ‘హైదరాబాద్‌లోని కళాకారులనే కలుసుకున్నాం. వీరిలో స్థానిక కళాకారులే కాదు కలకత్తా, గుజరాత్.. వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారున్నారు. స్వర్ణకారుల షాప్‌లో ఒకరు మాస్టర్‌గా ఉంటారు. వారికి తప్ప మిగతా అందరికీ చాలా తక్కువ ఆదాయం ఉంటుంది. దీంతో కుటుంబాలు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారిని చూశాం. జ్యువెలరీ అంటే లగ్జరీ గూడ్ అని మనకు తెలుసు. వీటిని తయారుచేసేవారి దగ్గర కూడా బాగా డబ్బు ఉంటుంది అనుకుంటాం. కానీ, వాళ్ల దగ్గర ఏమీ ఉండటం లేదు. ఈ కారణంగా వారి పిల్లలు కనీస చదువులు కూడా కొనసాగించలేకపోతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో 25 మంది కళాకారులు పాల్గొన్నారు. సందర్శకులు వారి ఆభరణాలు కొనుగోలు చేసి, స్వర్ణకారులకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కుటుంబాలకు మేం ఇలా సాయంగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు ఈ యంగ్‌స్టర్స్. మన హస్తకళలన్నీ ముందు తరాలలోనూ సుసంపన్నంగా వెలగాలి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జనంలోకి వెళుతూ ఉంటే స్వర్ణకళాకారుల భవిత కూడా బంగారమే అవుతుంది. కళను గుర్తించండి... ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంత కష్టపడినా ఒక్కోరోజు నాలుగైదు వందలు కూడా రావు. బంగారాన్ని కాల్చి, తీగ తీసి, అత్యంత శ్రద్ధతో ఒక ఆభరణాన్ని తయారు చేయాలంటే ఎంతో టైమ్ పడుతుంది. ఇప్పుడంతా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకే వెళుతున్నారు. మా దగ్గర ఆభరణాలు చేయించుకునేవారు బాగా తగ్గిపోయారు. ప్రస్తుతం మేం ఆర్థికంగానే కాదు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. రాబోయే తరాలకు ఈ పని అందించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా పిల్లలను వేరే పనులు చూసుకోమని చెబతున్నాం. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రముఖులు మా పనిని గుర్తిస్తే ఈ కళ బతుకుతుంది. – గోవింద్, స్వర్ణకారుడు ప్రత్యేకమైనది ఏ పని అయినా ఒకసారి చేసి వదిలేయడం వల్ల సరైన ఫలితాలు రావు. ఈ విషయం స్వర్ణకారులను కలిసినప్పుడు మరింతగా అర్ధమైంది. నిరంతరం సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఎంచుకున్న కార్యక్రమం ఇది. దీనికి చాలా మంది ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ ఆలోచన ప్రత్యేకంగా ఉందని అభినందించారు. – శ్రీహర్షిత సాయపడదాం జ్యువెలరీ షాపులు వచ్చాక స్వర్ణకారుల కళానైపుణ్యం ప్రశ్నార్ధకంగానే మారింది. కోవిడ్ తర్వాత వీరి ఇబ్బందులు మరీ పెరిగాయి. కంటిచూపు, గంటలు గంటలు కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్పెయిన్తో సఫర్ అవుతున్నారు. ఈ విధంగా వారికి సాయం పడటం సంతోషాన్నిచ్చింది. – ప్రకృతి – నిర్మలారెడ్డి -
మునిసిపల్ పగ్గాలు చేపట్టిన యంగ్‌స్టర్స్
-
మహిళావని
నమ్మించి మోసం న్యూఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో 28 ఏళ్ల యువతిని ఒక షాపింగ్ మాల్ నుంచి అపహరించుకుని వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు వ్యక్తులలో ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎంబ్రియాలజిస్టు (గర్భస్థ శిశువులపై పరిశోధనలు జరిపే వైద్య నిపుణురాలు) అయిన ఆ యువతిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ప్రధాన నిందితుడు గతవారం ఆమెను నమ్మించి షాపింగ్ మాల్‌కు రప్పించి, అక్కడి నుంచి మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేసి గుర్గావ్ శివార్లలో ఆమెపై అత్యాచారం జరిపి పారిపోయారు. న్యాయం–ప్రతీకారం! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మీద పూర్వపు మహిళా ఉద్యోగి ఒకరు తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేయడంతో సుప్రీంకోర్టు జడ్జిలు తమ నివాసాలలోని పనుల కోసం ఇక ముందు పురుషులను మాత్రమే నియమించుకోవాలని తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది! ఒక మహిళ ఆరోపణలు చేయడం వల్ల మిగతా మహిళలకు ఉద్యోగావకాశాలు రాకుండా పోయే ప్రమాదం ఉందనే సంకేతం పంపడానికే జడ్జీలు ఇలా బహిరంగంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు విషయంలో గొగోయ్ సమన్యాయ సూత్రానుసారం వ్యవహరించలేదని ‘సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్’, ‘ఎస్.సి. అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్’ సభ్యులు అంటుండగా, ‘ఎస్.సి. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్’, ‘ఎస్.సి. సెక్రెటేరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్’ అయనకు సంఘీభావం తెలిపాయి. ఉగ్రవాది కుటుంబం శ్రీలంకలోని షాంగ్రీ–లా హోటల్లో ఆత్మాహుతి దాడి జరిపిన ఉగ్రవాది భార్య, సోదరి అదే రోజు జరిగిన ఇంకో ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలో ఆదివారం వివిధ ప్రాంతాలలో జరిగిన ఏడు పేలుళ్లలో 290 మంది వరకు మరణించగా, అనేక వందల మందికి గాయాలయ్యాయి. స్థానిక ఇస్లామిక్ సంస్థ ఎన్టీజే (నేషనల్ తహీద్ జమాత్) ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు ఇప్పటికైతే భావిస్తున్నారు. గుండె నిబ్బరం ‘దాడి చేసినవాడిని మీ కలల్ని దోచుకుపోనివ్వకండి’ అనే సందేశంతో నిర్భయ తల్లి ఆశా దేవి, ఆసిడ్ దాడి అనంతరం ధైర్యం నిలిచిన లక్ష్మీ అగర్వాల్, ఎల్జీబీటిక్యూ హక్కుల కార్యకర్త లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ.. హైదరాబాద్‌లో సాధికారతపై జరిగిన ఒక సమావేశంలో తమ అనుభవాలు పంచుకున్నారు. ‘‘బాధితురాలైన మహిళ చీకట్లోనే కుమిలిపోకుండా తనకు తనుగా ఎలా నిలబడి వెలుగులోకి రావాలన్నది తెలసుకోవాలి. పరిస్థితులతో నిబ్బరంగా పోరాడాలి. తన కలల్ని నిజం చేసుకోవాలి’’ అని ఆశ, అగర్వాల్, త్రిపాఠీ అన్నారు. విమర్శల వివాదం సాధ్వి ప్రజ్ఞసింగ్, మహారాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే వేర్వేరు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భూపాల్ ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞ.. ‘కట్టడం శిఖరం వరకు ఎక్కాను. కూల్చివేతలో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది’ అని అయోధ్య ఘటన గురించి వ్యాఖ్యానించడంతో ఎన్నికల సంఘం ఆమెపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది. మరోవైపు పంకజ ఆదివారంనాడు జల్నా ప్రచార సభలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్య కూడా వివాదాస్పదం అయింది. ‘‘సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినట్లుగా సాక్ష్యాలు చూపించమని అడగుతున్నారు. రాహుల్ గాంధీకి బాంబు కట్టి పంపిస్తే సరి’’ అని ఆమె అన్నారు! -
నిరుపేదకు ఫేస్బుక్ మిత్రుల సాయం
అనంతపురం, రాప్తాడు: తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రాప్తాడు మండల కేంద్రానికి చెందిన యువకులు వినూత్నంగా ఆలోచించారు. ఇందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా ఎంచుకున్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికతో పాటు గ్రామంలో కూడు, గూడు, గుడ్డకు నోచుకోని వారికి తోచిన సాయమందించాలని భావించారు. వెంటనే ఫేస్బుక్లో ‘రాప్తాడు డెవలప్మెంట్ ఫోరం’ అనే పేరుతో ఓ గ్రూప్‌ను క్రియేటివ్ చేశారు. అందులో దాదాపు 300 మంది వరకు సభ్యులుగా చేరారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఒక మిత్రుడు... గత ఏడాది రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన దళిత మహిళ శకుంతలమ్మ అనారోగ్యంతో బాధపడుతుందని... ఆమెకు సాయం చేద్దామని సూచించాడు. అప్పటికప్పుడే ఫోరంలోని సభ్యులంతా చర్చించుకొని తెలుగు పండుగ సంక్రాంతి రోజున ఆమెకు సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం మిత్రులంతా కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతలమ్మ ఇంటికి వెళ్లి తమ వంతు బాధ్యతగా రూ.7,100 నగదు, బ్రెడ్లు అందజేశారు. మున్ముందు ఈ కుటుంబానికి మరింత అండగా ఉంటామన్నారు. ‘రాప్తాడు డెవలప్మెంట్ ఫారం’ పార్టీలకతీతంగా, కులాలకు అతీతంగా ముందుకు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు. -
నరసింహా 6/18
ఎ- డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో పీఎస్ యంగ్‌స్టర్స్ బౌలర్ నరసింహా (6/18) అద్భుతంగా రాణించాడు. దీంతో సోమవారం మణికుమార్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యంగ్‌స్టర్స్ జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్‌స్టర్స్ జట్టు 38.3 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. మణికుమార్ బౌలర్లలో సంజయ్ 3, భరత్ 4 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మణికుమార్ జట్టు నరసింహ ధాటికి 30.3ఓవర్లలో 54 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు భారతీయ సీసీ:64 (పవన్ 3/20, విజయ్ 3/19, రాము 3/1); కాకతీయ సీసీ: 66/3 (8.1 ఓవర్లలో) మహేశ్ సీసీ:104 (అశ్విన్ 41, అఫ్రోజ్ 3/21, మణికంఠ 4/27); రుషిరాజ్ సీసీ: 104/9 ( షేక్ దాదర్ 34; నరేశ్ 3/13). లాల్‌బహదూర్ పీజీ: 132 (దినేశ్ 38; మోయిజ్ 3/26); అజాద్ సీసీ: 134 /4 (హుస్సేన్ 32, బద్రి 54; దినేశ్ 3/37) భారతీయ సీసీ: 186/9 (పృథ్వీ రాజ 34, చంద్రశేఖర్ 75నాటౌట్; శ్రీకాంత్ 3/22); విజయపురి విల్లోమెన్: 187/1 (మురళి 90, షాకిర్ అహ్మద్ 88నాటౌట్) నవజీవన్ ఫ్రెండ్స్: 145 (ఆర్యన్ 32, గిరిబాబు 32; షహనాజ్ 3/36); ఆడమ్స్ ఎలెవన్: 143 (సచిన్ 64 నాటౌట్; గిరిబాబు 3/26) సదరన్ స్టార్: 124/7 (సత్య 34; రిత్విక్ 3/20); తిరుమల సీసీ: 125/2 (ధనుంజయ్ 53, రిత్విక్ 47నాటౌట్) రోషనారా: 176 ( అనిల్ 52నాటౌట్; అనిరుధ్ 4/35);టీమ్ కున్: 23/1 (7 ఓవర్లలో) సౌతెండ్ రేమండ్‌స: 117 (37.3ఓవర్లలో);మయూర్ సీసీ: 74 (27.5 ఓవర్లలో) ఎస్కే బ్లూస్ 179 ( ముస్తాక్ 41, దీపాంకర్ 31); విక్టరీ సీసీ: 180/3 (శ్రేయస్ 48, రోహిత్ సాగర్ 84) ఇంపీరియల్ సీసీ: 65 (అజ్మీర్3/13, వినయ్3/15); కిషోర్ సన్స:66 ( చిరాగ్ పటేల్ 32నాటౌట్) రోషనార: 230/5 (నయన్ 51, ఉదయ్ 32, శ్రీకాంత్ 89; జకారియా 3/39);విక్టోరియా సీసీ: 67 ( అక్బర్ 3/15; విజయ్ 4/9) డెక్కన్ కోల్ట్స్:258/9 (మణిదీప్ 73, నరేందర్39); గ్రీన్లాండ్స: 122 (అనుజ్ 40; రాజీవ్ 3/30) సట్టన్ సీసీ: 65 (విజయ్ 3/13, పవన్ 3/13, రుద్రశివ 3/13);సాత్విక్ యూనియన్: 66/1 (అగ్రజ్ 48నాటౌట్) యంగ్ సిటిజన్: 226/8 (హన్మంత్ 39; హర్ష్ 4/62); సఫిల్‌గూడ: 85 (సారుు 3/8, అంకిత్ రామ్ 4/21).