
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేందర్ సెహ్వాగ్ మరోసారి యువరాజ్ సింగ్‌కు మద్దతు ప్రకటించాడు. మిడిలార్డర్‌లో యువరాజ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో యువీ అద్భుతాలు చేస్తాడని కితాబు ఇచ్చాడు.
జట్టులోకి యువరాజ్ త్వరలోనే పునరాగమనం చేస్తాడన్న నమ్మకాన్ని సెహ్వాగ్ వ్యక్తం చేశాడు. యువరాజ్ ఇప్పటికీ మ్యాచ్ విన్నరే.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదన్నాడు.భారత జట్టులోకి మళ్లీ యువరాజ్ లాంటి ఆటగాడు ఇప్పట్లో వస్తాడన్న నమ్మకం తనకు లేదన్నాడు. యోయోలో 36 పాయింట్లు సాధించిన యువీని.. త్వరలోనే టీమిండియా జెర్సీలో చూడొచ్చని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment