న్యూఢిల్లీ: టీమిండియా ప్రస్తుత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా-మాజీ క్రికెటర్ యువరాజ్‌లు ప్రత్యర్థులుగా తలపడితే ఎవరు పైచేయి సాధిస్తారనేది చెప్పడం అభిమానులకు కాస్త కష్టమే. అయితే తనను బుమ్రా ఇబ్బంది పెట్టిన విషయాన్ని యువీ తాజాగా గుర్తు చేసుకున్నాడు. యార్కర్లు, బౌన్సర్లతో బుమ్రా తనను చాలా ఇబ్బంది పెట్టాడని యువీ చెప్పుకొచ్చాడు. చాలా సందర్భాల్లో బుమ్రాను ఆడటం తనకు సవాల్‌గా ఉండేదన్నాడు.కాకపోతే ఇప్పుడు బుమ్రాకు చుక్కలు చూపించాడు యువీ. అది క్రికెట్ ఫీల్డ్‌లో కాదు.. సోషల్ మీడియాలో బుమ్రాను కార్నర్ చేశాడు యువీ. రకరకాల ప్రశ్నలతో బుమ్రాను టార్గెట్ చేస్తూ ముప్పు తిప్పలు పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో భాగంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో బుమ్రాను ఆడేసుకున్నాడు. ప్రతీ ప్రశ్నకు ఐదు సెకన్ల సమయం మాత్రమే ఇచ్చి సమాధానాలు రాబట్టాడు యువీ. (‘ఆ భారత బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చాలా కష్టం’)
యువీ ప్రశ్న: విరాట్ కోహ్లి లేక జ్లటాన్ ఇబ్రాహిమోవిక్(స్వీడన్ ఫుట్‌బాల్ ప్లేయర్)లలో నీ ఫిట్‌నెస్ ఐడల్ ఎవరు..?
బుమ్రా జవాబు: జ్లటాన్.. కాకపోతే అతను నా ఫిట్‌నెస్ ఐడల్ కాదు.. ఓవరాల్‌గా నా ఐడల్
యువీ ప్రశ్న: కోహ్లి- టెండూల్కర్‌లలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్
బుమ్రా జవాబు: వీరిలో ఎవరు ఉత్తమం అనే జడ్జ్ చేసేంత క్రికెట్ నేను ఇంకా ఆడలేదు. వారు నా కంటే ఎక్కువ క్రికెట్ ఆడారు. నేను నాలుగేళ్లుగా మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాను. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం
దీనిపై యువీ రిప్లే ఇస్తూ.. ‘నేను నీ ఆటోబయోగ్రఫీ అడగడం లేదు. నువ్వు కరెక్ట్‌గా నా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌కు ఒక జవాబు చెప్పు. నీ ఫేవరెట్ ఆటగాడు ఎవరో చెప్పు’?
బుమ్రా స్పందిస్తూ.. ‘ ఇలా ఇబ్బంది పెడితే ఎలా.. నువ్వు-ధోనిల్లో ఎవరు అత్యుత్తమం అని అడిగితే ఎలా ఉంటుందో, అదే తరహా ప్రశ్న వేశావ్. నేను అందరికీ ఒకే గౌరవాన్ని ఇస్తా.
యువీ తరువాత ప్రశ్న: యువరాజ్-ధోనిల్లో నీ ఫేవరెట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఎవరు?
బుమ్రా జవాబు: యువీ.. మీ ఆటను చూస్తూ పెరిగాను. నీ ఆటను, ధోని ఆటను చూస్తూ క్రికెట్‌ను ఆస్వాదించా. నన్ను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నావ్.
యువీ మరో ప్రశ్న: మహ్మద్ షమీ, అక్షర్ పటేల్‌లలో ఎవరు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు?
బుమ్రా జవాబు: ఇది చెప్పడం చాలా కష్టం. కానీ నా ప్రకారం చూస్తే షమీ కంటే అక్షర్ బెటర్
యువీ ప్రశ్న: హర్భజన్ సింగ్-అశ్విన్‌లలో ఎవరు మెరుగైన ఆఫ్ స్పిన్నర్?
బుమ్రా జవాబు: ఏయ్ యువీ.. నువ్వు వివాదాస్పద ప్రశ్నలు అడుగుతాన్నావు. నేను అశ్విన్‌తో చాలా మ్యాచ్‌లు ఆడాను. హర్భజన్ సింగ్ ఆటను చూస్తూ పెరిగాను. నీప్రశ్నకు కచ్చితంగా సమాధానం చెప్పాలంటే భజ్జీనే ఎంచుకుంటా.
ఇక‍్కడ చదవండి: నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్ అన్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment