యువీ రంగం | yuvraj singh one man show | Sakshi
Sakshi News home page

యువీ రంగం

Published Fri, Oct 11 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

యువీ రంగం

యువీ రంగం

 రాజ్‌కోట్: 202 పరుగుల లక్ష్యం.. 100కే నాలుగు వికెట్లు ఫట్.. 53 బంతుల్లో 102 పరుగులు చేయాలి.. ఈ దశలో సూపర్ ఫామ్‌తో అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్న యువరాజ్ (35 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు; 5 సిక్స్) తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ధనాధన్ ధోని (21 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) యువీకి సహకారం అందించడంతో భారత్ ముందు ఈ లక్ష్యం తేలిపోయింది. ఫలితంగా గురువారం  సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (52 బంతుల్లో 89; 14 ఫోర్లు; 1 సిక్స్), నిక్ మ్యాడిన్సన్ (16 బంతుల్లో 34; 6 ఫోర్లు; 1 సిక్స్) జోరుతో 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ (13 బంతుల్లో 27; 4 సిక్స్) చివర్లో రెచ్చిపోయాడు. అనంతరం బరిలోకి దిగిన ధోని సేన 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 202 పరుగులు చేసి నెగ్గింది. ధావన్ (19 బంతుల్లో 32; 5 ఫోర్లు), కోహ్లి (22 బంతుల్లో 29; 2 ఫోర్లు; 1 సిక్స్) ఓ మాదిరిగా రాణించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా యువరాజ్ నిలిచాడు.
 
 తుపాను ఆరంభం: ఆసీస్ ఓపెనర్ల ఎదురుదాడి తొలి ఓవర్ నుంచే ప్రారంభమైంది. ఓవర్‌కు 11 పరుగులకు పైగా రన్‌రేట్‌తో సాగిన ఈ జోరుకు భువనేశ్వర్ బ్రేక్ వేశాడు. ఐదో ఓవర్‌లో దూకుడు మీదున్న మ్యాడిన్సన్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత  ఎనిమిదో ఓవర్‌లో వాట్సన్ (6), బెయిలీ వికెట్లను వినయ్ కుమార్ కూల్చాడు. అటు 29 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఫించ్ 17వ ఓవర్‌లో అవుటయ్యాడు.
 
 ఆరంభంలోనే వికెట్లు పడినా: భారీ లక్ష్యాన్ని అందుకునేందుకు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు రెండో ఓవర్‌లోనే రోహిత్ (8) వికెట్‌ను కోల్పోయింది. శిఖర్ ధావన్, రైనా (13 బంతుల్లో 19; 2 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడి రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఈ రెండు వికెట్లతో పాటు కోహ్లి కూడా అవుట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడినట్టు కనిపించింది. కానీ యువీ, ధోని రాకతో ఆట స్వరూపమే మారింది. ముఖ్యంగా వరుస సిక్స్‌లతో యువరాజ్ ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తించాడు.
 
 స్కోరు వివరాలు
 ఆసీస్ ఇన్నింగ్స్: ఫించ్ (సి అండ్ బి) వినయ్ 89; మ్యాడిన్సన్ (బి) భువనేశ్వర్ 34; వాట్సన్ ఎల్బీడబ్ల్యు (బి) వినయ్ 6; బెయిలీ (సి) జడేజా (బి) వినయ్ 0; మ్యాక్స్‌వెల్ (సి) ఇషాంత్ (బి) జడేజా 27; హాడిన్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 5; హెన్రిక్స్ (సి) యువరాజ్ (బి) భువనేశ్వర్ 12; కౌల్టర్ నైల్ నాటౌట్ 12; ఫాల్క్‌నర్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 201.
 
 వికెట్ల పతనం: 1-56; 2-84; 3-84; 4-124; 5-146; 6-174; 7-180.
 బౌలింగ్: భువనేశ్వర్ 4-0-35-3; వినయ్ 4-0-26-3; అశ్విన్ 2-0-41-0; ఇషాంత్ 4-0-52-0; జడేజా 4-0-23-1; కోహ్లి 2-0-24-0.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హాడిన్ (బి) మెక్‌కే 8; ధావన్ (స్టంప్డ్) హాడిన్ (బి) డోహర్తి 32; రైనా (సి) వాట్సన్ (బి) కౌల్టర్ నైల్ 19; కోహ్లి (సి) ఫాల్క్‌నర్ (బి) మెక్‌కే 29; యువరాజ్ నాటౌట్ 77; ధోని నాటౌట్ 24; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 202.
 
 వికెట్ల పతనం: 1-12; 2-50; 3-80; 4-100.
 బౌలింగ్: వాట్సన్ 3.4-0-29-0; మెక్‌కే 4-0-50-2; ఫాల్క్‌నర్ 4-0-36-0; కౌల్టర్ నైల్ 4-0-44-1; హెన్రిక్స్ 1-0-15-0; డోహర్తి 3-0-24-1.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement