
స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న లారీ:15 మందికి గాయాలు
నంద్యాల(కర్నూలు జిల్లా): నంద్యాల పట్టణంలోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాను రోడ్డుపక్కనున్న గుంతలో పడిపోయింది ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.