
చంఢీఘర్: పంజాబ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 12 మంది విద్యార్థులు ఉండగా, నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. భారత్‌లో బాలుడి హత్యకు లండన్‌లో కుట్ర!
వ్యాన్‌లో మంటలు ఎలా చెలరేగాయో అనేదానిపై విచారణ జరుపుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘన్‌శ్యాం తోరీ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి సంగ్రూర్ ఎస్‌డీఎం, తహసీల్దార్‌లను పంపినట్లు చెప్పారు. ఇక విద్యార్థులకు అత్యవసర వైద్యం అందించేందుకు పలువురి డాక్టర్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(చదవండి: పక్కింటి మహిళతో ప్రేమాయణం.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా..!)
Comments
Please login to add a commentAdd a comment