350 మంది అమ్మాయిలతో తిరిగాను | 350 girls wandered | Sakshi

350 మంది అమ్మాయిలతో తిరిగాను

Dec 12 2014 2:19 AM | Updated on Mar 18 2019 9:02 PM

350 మంది అమ్మాయిలతో తిరిగాను - Sakshi

350 మంది అమ్మాయిలతో తిరిగాను

మండ్యాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తనకు విరుద్ధంగా హై కమాండ్‌కు లేఖ రాయడం,...

ఈ వయసులో చూడటానికి ఏమి ఉంటుంది ?
మంత్రి అంబరీష్ దబాయింపు


బెంగళూరు : మండ్యాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తనకు విరుద్ధంగా హై కమాండ్‌కు లేఖ రాయడం, శాసనసభలో ఫోన్ చూసి కాలం గడపడంపై వచ్చిన విమర్శలకు  మంత్రి  అంబరీష్ నిర్లక్ష్య వైఖరితో సమాధానాలు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఈ రెండు విషయాలపై స్పందించాల్సిందిగా సువర్ణ  విధానసౌధాలో మీడియా అంబరీష్‌ను కోరగా ‘నేను హీరోను. నాకు ఒక ప్రైవేటు లైఫ్ ఉంటుంది. తాగుతాను, డ్యాన్స్ చేస్తాను. 350 మంది అమ్మాయిలతో తిరిగాను.

(350 హుడిగిర జొత ఓడాడిద్దేనే). అదంతా ప్రైవేట్ వ్యవహారం.’ అన్నారు. ఇక శాసనసభలో మొబైల్ ఫొన్ వాడటంపై మాట్లాడుతూ.. ‘ ఎవరో నాకు వారి ఫోన్ సరిగా పనిచేయడం లేదని చూపిస్తే ఫోన్‌ను తాకాను. దానికే రాద్దాంతమా? అయినా ఈ వయసులో చూడటానికి ఏమి ఉంటుంది’ అని నవ్వుకొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement