Carefree attitude
-
ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి
దుబ్బాక: ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందంటూ ఆశ వర్కర్లు గురువారం దుబ్బాకలో సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని వారు ధ్వజమెత్తారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని హెచ్చరించారు. ఉపకార వేతనాలను విడుదల చేయాలి సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం తార డిగ్రీ కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మకు ఉరి వేసి నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ అనిల్‌రెడ్డి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను వారి పిల్లలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయీంబర్స్మెంటు, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నెహ్రూ, నాయకులు అశోక్, సంగమేశ్వర్, నరేష్, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం -
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధి కరువు
- ఫార్మా-డి డాక్టర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లబ్బీపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉపాధి మార్గం లేక ఫార్మా-డి కోర్సు చేసినవారు బజారున పడాల్సిన దుస్థితి నెలకొందని అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫార్మశీ, ఫార్మా-డి డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫార్మా-డి కోర్సు పూర్తిచేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బం దులు పడుతున్నామంటూ విద్యార్థులు శనివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పుష్పా హోటల్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు చర్యలు లేకుండా ఎంతో ఆర్భాటంగా కోర్సు ప్రవేశపెట్టి, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలను అయోమయంలోకి నెట్టిందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి 50 పడకల ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మశిస్టును నియమించాలని, ప్రతి జిల్లాకు 3, 4 డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటుచేయాలని, వైద్యులకు, రోగులకు వారు వినియోగించే మందులపై అవగాహన తెచ్చేందుకు ఇవి దోహదపడతామని వారు ప్రభుత్వానికి సూచించారు. ప్రతి ఆస్పత్రిలో పేషెంట్ కౌన్సెలింగ్ సెంటర్లు, ప్రతి జిల్లాకు ఒక ఫార్మకో విజిలెన్స్ సెం టర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో 200 మందికిపైగా ఫార్మా డాక్టర్లు, నగర వైద్యులు జగదీష్, ప్రశాంత్, కృష్ణవేణి, హర్షవర్ధన్, ప్రవీణ్, చంద్రశేఖర్, సత్యసునీల్, నరేష్, రామలక్ష్మి, విజయ్, కృపాల్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ హోదా దక్కినా.. దక్కని ‘చంద్ర’కటాక్షం
♦ పోల‘వరం’పై నిర్లక్ష్యం ♦ ప్రాజెక్టు గురించి పట్టించుకోని బాబు సర్కారు ♦ బాబు పగ్గాలు చేపట్టి 11 నెలలవుతున్నా.. 11 అంగుళాలూ ముందుకు జరగని ప్రాజెక్టు నిర్మాణం ♦ నిర్మాణ పురోగతిపై పోలవరం అథారిటీ తీవ్ర అసంతృప్తి ♦ అయినా.. పట్టించుకోని ప్రభుత్వం ♦ కాంట్రాక్టర్‌ను రక్షించేందుకు, పోల‘వరాన్ని’ జాప్యం చేసేందుకే మొగ్గు ♦ హడావుడిగా పట్టిసీమకు శంకుస్థాపన ♦ ఫలితం.. పోలవరానికి ‘చంద్ర’గ్రహణం ♦ ఈ ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్య వైఖరి ఖరీదు.. రాష్ట్ర అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నిర్మాణం దాకా వచ్చిన పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వపు నిర్లక్ష్యపు ధోరణి అడుగడుగునా అడ్డుతగులుతోంది. జాతీయ హోదా దక్కినా.. చంద్రబాబు కటాక్షం దక్కక పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. ప్రాజెక్టు ఖర్చంతా కేంద్రమే భరించడానికి సిద్ధంగా ఉన్నా, సహకారమందించి పనులు వేగవంతం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా లేకపోవడం.. ‘అంగట్లో అన్నీ ఉన్నా..’ సామెతను గుర్తుకుతెస్తోంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తాగు, సాగునీరు ఇచ్చి ప్రజలను కరువు నుంచి, దాహార్తి నుంచి బయటపడేయటానికి గుమ్మం ముందుకొచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలదన్నడం విడ్డూరమంటూ ఇటు ఇంజనీరింగ్ నిపుణులు, అటు ప్రజలు విమర్శిస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం అథారిటీకి అన్నివిధాలుగా సహకారం అందించాల్సింది పోయి, కాంట్రాక్టర్‌ను రక్షించడానికి, ఏదోవిధంగా పోల‘వరాన్ని’ ఆలస్యం చేయడానికే చంద్రబాబు మొగ్గుచూపడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. పనులు జరుగుతున్న తీరుపట్ల అథారిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసినా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. చంద్రబాబు అధికారం చేపట్టి 11 నెలలవుతున్నా.. 11 అంగుళాల పని కూడా జరగలేదు. ఫలితంగా కేంద్రం నుంచి భారీగా నిధులు రాలేదని అధికారులు చెబుతున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తే వైఎస్సార్‌కు ఆ ఘనత దక్కుతుందని, అందుకే సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకోసమే కేంద్రానికి కూడా సహకరించట్లేదని ఇంజనీర్లు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో పోలవరానికి ఉరేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఎత్తున ‘సొమ్ము’ చేసుకోవడంతోపాటు పోలవరాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేసినట్టు నిపుణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండడం గమనార్హం. వైఎస్ ప్రారంభించిన పోలవరం కోస్తా జిల్లాల్లోని బీడువారిన భూములను సస్యశ్యామలం చేయడంతోపాటు విద్యుత్ కొరతను తీర్చగలిగే సామర్థ్యమున్న, అలాగే రాయలసీమకు తాగునీటి అవసరాలు తీర్చే బహుళార్థ సాధక ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2006లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేతంగా ప్రారంభించారు. వైఎస్ హయాంలో కుడి, ఎడమ కాలువల పనులతోపాటు హెడ్‌వర్క్స్‌లో భాగంగా స్పిల్‌వే, ట్విన్ టన్నెల్స్, కుడి, ఎడమ కనెక్టివిటీస్ నిర్మాణ పనులూ మొదలయ్యాయి. అయితే నిర్మాణపనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ అనుకున్నంత వేగంగా పనులు చేయకపోవడంతో విడివిడిగా ఇచ్చిన స్పిల్‌వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్‌హౌస్ టెండర్లను వైఎస్ రద్దు చేశారు. ఈ మూడు ప్యాకేజీలను కలిపి ఒకే ప్యాకేజీగా టెండర్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆయన మరణానంతరం అప్పటి రాష్ట్రప్రభుత్వం దాదాపు మూడేళ్లకుపైగా కాలయాపన చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని నీరుగార్చింది. ఎట్టకేలకు ఏడాదిన్నరక్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం స్పిల్‌వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్‌లను ఒకే ప్యాకేజీగా ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి అప్పగించింది. నత్తకే నడక నేర్పుతున్న కాంట్రాక్టర్ అయితే ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో కాదు కదా.. కనీసమాత్రంగా కూడా జరగట్లేదు. రూ.4,054 కోట్లకు టెండర్ దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ 48 నెలల్లో పనులు పూర్తి చేయాలి. కాంట్రాక్టు దక్కించుకుని ఇప్పటికి 20 నెలలు దాటినా హెడ్‌వర్క్స్‌కు సంబంధించి కేవలం ఐదున్నర శాతం పనులే పూర్తయ్యాయంటే పనుల తీరు అర్థమవుతోంది. కనీసం నెలకు రూ.85 కోట్ల విలువైన పనులైతేనే.. నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందంలోగా ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ ప్రస్తుతం కేవలం రూ.4 కోట్ల విలువైన పనులే జరుగుతున్నాయి. ఈ లెక్కన చూస్తే.. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఇరవై ఏళ్లు పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పునరావాస సమస్యలు.. పరిష్కారానికి చొరవ చూపని సర్కారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం మండలంలో 26 గ్రామాలు ముంపునకు గురవుతుండగా వీటిలో ఏడు గ్రామాలు హెడ్‌వర్క్స్ పనుల సమీపంలో ఉన్నాయి. ఈ గ్రామాలవారిని ముందుగా ఖాళీ చేయించేందుకు అధికారులు పునరావాస ప్యాకేజీ అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఒక్క గ్రామానికి కూడా పూర్తి ప్యాకేజీ అమలు కాలేదు. పునరావాస ప్యాకేజీల అమలుకు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో... నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని తరలిస్తేనే పనులు చేయడానికి అవకాశం ఉంటుందని కాంట్రాక్టర్ సాకుగా చెబుతున్నారు. పనుల్లో జాప్యమే ఇటు ప్రభుత్వానికి, అటు కాంట్రాక్టర్‌కు అవసరమని, అందుకే నాటకాలు ఆడుతున్నారని ఇంజనీర్లే అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతుందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. పనులు జరుగుతున్న తీరిదీ... ♦ వాస్తవానికి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉంది. ప్రారంభించిన సమయంలో రోజుకు 60 నుంచి 65 వేల క్యూబిక్ మీటర్ల పనులు జరిగేవి. అవి క్రమేణా తగ్గుముఖం పట్టి ఇప్పుడు కేవలం 15 నుంచి 20వేల క్యూబిక్‌మీటర్ల పనులే ప్రతిరోజూ జరుగుతున్నాయి. ♦ వాస్తవానికి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ పనులు జరగాల్సి ఉంది. ♦ ఫౌండేషన్ వర్క్‌కు సంబంధించి మొత్తం పదికోట్ల క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉండగా.. ఇప్పటికి 50 లక్షల మీటర్ల పనులే పూర్తయ్యాయి. ♦ స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్‌హౌస్ ఫౌండేషన్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇంతవరకు మొదలే కాలేదు. ♦ మొత్తంగా ఇప్పటికి ఐదున్నర శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ♦ రూ. 4,054 కోట్ల పనులకుగాను రూ.200 కోట్లలోపు విలువైన పనులే పూర్తయ్యాయి. ♦ చంద్రబాబు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్‌కు రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం అవకాశం లేకున్నా, మిషనరీని తనఖా పెట్టుకొని నిధులు విడుదల చేయాలని స్వయంగా సీఎం ఆదేశించారు. తీరా.. మిషనరీ, వాహనాల డాక్యుమెంట్లు తనఖా పెట్టాలని అధికారులు అడిగితే.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొన్న మిషనరీ, వాహనాల డాక్యుమెంట్లు బ్యాంకులవద్దే ఉన్నాయని కాంట్రాక్టర్ చల్లగా చెప్పారు. చేసేదేమీ లేక.. అధికారులు మిన్నకుండిపోయారు. -
కొనుగోల్‌కు దూరం
‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’..అన్నట్లు తయారైంది ఖరీఫ్ వరి పండించిన రైతుల పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు, సుడిదోమ కారణంగా చాలా పంట పోగా.. చేతికొచ్చిన కాస్త పంటనైనా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా పెద్దగా కొనుగోళ్లు జరగడం లేదు. పైగా సవాలక్ష నిబంధనలు పెట్టడంతో ప్రభుత్వ కేంద్రాల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. ఇదేఅదనుగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు నచ్చిన ధరకు కొంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. పాలకొండ:రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతుల్లో అవగాహన లోపం, అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ వ్యాపారులకు వరంగా పరిమిస్తున్నాయి. జిల్లాలో వంద కేంద్రాల్లో రెండు లక్షల క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 16 కేంద్రాల ద్వారా 981 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా చాలాచోట్ల కేంద్రాలే తెరుచుకోలేదు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావంతో ఆలస్యంగా నాట్లు పడ్డాయి. దాన్ని ఎలాగో అధిగమించి పంట సాగు చేస్తే.. అక్టోబర్ సంభవించిన హుద్‌హుద్ తుపాను, ఆ వెంటనే వచ్చిన వరదలు చాలావరకు పంటను నాశనం చేశాయి. అటు తర్వాత సుడిదోమ దాడి చేసింది. ఫలితంగా చివరికి కొద్దిపాటి పంట మాత్రమే రైతుకు దక్కింది. దాన్ని సొమ్ము చేసుకుందామని రైతు తాపత్రయ పడుతుంటే ఇక్కడా పరిస్థితులు అనుకూలించడంలేదు. లభించని ‘మద్దతు’ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతును మద్దతు ధర, మిగిలిన ధాన్యం కొనగోలు విషయంలో అండగా ఉంటామని ప్రభుత్వం ఆర్భాటం చేసింది. జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అలాగే రకాలవారీగా మద్దతు ధర కూడా ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే.. జిల్లాలో ఇప్పటివరకు 16 కేంద్రాల్లోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల కేంద్రాలే ప్రారంభం కాకపోగా, ప్రారంభమైన పలు చోట్ల కొనుగోళ్లు చేపట్టడంలేదు. ప్రస్తుతం రైతు సాధికార సదస్సులు, రుణమాఫీ వ్యవహారాలతో అధికారులు బిజీ అయిపోవడంతో మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. కాగా ఏ గ్రేడ్ క్వింటాలు రూ.1400, కామన్ రకం క్వింటాలు రూ.1360 మద్దతు ధరగా ప్రకటించి, దానికంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్-1 రకం కొనుగోళ్లే ఇంతవరకు జరపకపోవడం విశేషం. అన్నీ సమస్యలే కొనుగోలు కేంద్రాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. కేంద్రాలకు ధాన్యం తీసుకెళితే నాణ్యత పరీక్షల పేరుతో సవాలక్ష వంకలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించాలి. 16 కి.మీ. లోపు దూరానికి టన్నుకు రూ.300 చొప్పున, 16 కి.మీ. మించిన దూరానికి క్వింటాకు 4 రూపాయలు చొప్పున చెల్లించాలి. వాస్తవానికి ధాన్యం రవాణాకు ఈ చార్జీలు ఏమాత్రం సరిపోవు. అలాగే గత ఏడాది కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యానికి రవాణా చార్జీలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు. మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల నుంచి ఇక్కడికి ధాన్యం రవాణా సమస్యగా మారుతోంది. దీంతో రైతులు ఈ ఏడాది కేంద్రాల వైపు చూడడం మానేశారు. అధికారులు ఈ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యత పేరుతో కొర్రీలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మాలనుకున్న రైతులు ముందుగా నాణ్యత పరీక్షల కోసం రెండు మూడు కేజీల ధాన్యాన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందులో తేమ శాతం, పొల్లు, రాళ్లు తదితర పరీక్షలు జరిపి ధర నిర్ణయిస్తున్నారు. ఈ ధర ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న దాని కంటే తక్కువగానే ఉంటోందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే లభించడం లేదన్నది రైతుల వాదన. తుపానుకు పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో నాణ్యత ఎక్కడ ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటాడుతున్న వర్షాల భయం కాగా కొద్దిరోజులుగా వాతావరణం మబ్బు పెట్టి అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో భయం మొదలైంది. అమ్ముకునే పరిస్థితి లేక కళ్లాల్లో నే ధాన్యం కుప్పలుగా నిల్వ చేశారు. ఈ తరుణంలో వర్షాలు పడితే పడితే పూర్తిగా తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. దాంతో గత్యంతరం లేక అందుబాటులో ఉన్న వ్యాపారులకే ధాన్యం విక్రయిస్తున్నారు. నిబంధనలు ఇలా.. ప్రతి మండలంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా రెండు మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి కేంద్రం వద్ద ప్యాడీ క్లీనర్లు, తేమను నిర్థారించే మాయిశ్చర్ మీటర్లు, నాణ్యత నిర్థారణకు క్యాలీపర్స్, కాటాలు, జల్లెడలు ఉంచాలి. ప్రతి కేంద్రం వద్ద ఐదుగురు సభ్యులతో కూడిన బృందం రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత పరిశీలించి ధర నిర్ణయిస్తుంది. ఆ ధరకు అమ్మకానికి ధాన్యం తెచ్చే రైతు ఆన్లైన్లో డబ్బు చెల్లించేందుకు వీలుగా బ్యాంకు ఖాతా వివరాలు తెలిపే పత్రాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నాణ్యత, ధర నిర్ణయించిన తర్వాత ధాన్యం అమ్మకానికి సిద్ధపడే రైతుకు పౌరసరపరాల సంస్థ ఖాళీ గోనెసంచులు రైతులు వాటిలో ధాన్యాన్ని నింపి కొనుగోలు కేంద్రంలో అప్పగించాలి. ధాన్యం పండించిన భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలతో కూడిన అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకం, రుణ అర్హత కార్డు వంటి వాటి జెరాక్స్ కాపీలు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అందజేయాలి. దీనివల్ల ఆ ధాన్యం సదరు రైతువేనని నిర్థారించుకునేందుకు వీలవుతుంది. కేంద్రం వద్ద ధాన్యం అన్లోడింగ్, కాటా వేయించడం, బస్తాలు కుట్టడానికి అయిన ఖర్చుల్లో రైతు, పౌరసరఫరాల సంస్థ కలిసి భరించాలి. -
350 మంది అమ్మాయిలతో తిరిగాను
ఈ వయసులో చూడటానికి ఏమి ఉంటుంది ? మంత్రి అంబరీష్ దబాయింపు బెంగళూరు : మండ్యాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తనకు విరుద్ధంగా హై కమాండ్‌కు లేఖ రాయడం, శాసనసభలో ఫోన్ చూసి కాలం గడపడంపై వచ్చిన విమర్శలకు మంత్రి అంబరీష్ నిర్లక్ష్య వైఖరితో సమాధానాలు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఈ రెండు విషయాలపై స్పందించాల్సిందిగా సువర్ణ విధానసౌధాలో మీడియా అంబరీష్‌ను కోరగా ‘నేను హీరోను. నాకు ఒక ప్రైవేటు లైఫ్ ఉంటుంది. తాగుతాను, డ్యాన్స్ చేస్తాను. 350 మంది అమ్మాయిలతో తిరిగాను. (350 హుడిగిర జొత ఓడాడిద్దేనే). అదంతా ప్రైవేట్ వ్యవహారం.’ అన్నారు. ఇక శాసనసభలో మొబైల్ ఫొన్ వాడటంపై మాట్లాడుతూ.. ‘ ఎవరో నాకు వారి ఫోన్ సరిగా పనిచేయడం లేదని చూపిస్తే ఫోన్‌ను తాకాను. దానికే రాద్దాంతమా? అయినా ఈ వయసులో చూడటానికి ఏమి ఉంటుంది’ అని నవ్వుకొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పారిశుధ్యం పట్టని సర్కారు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని కాగ్ విమర్శించింది. పారిశుధ్యం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పూర్తిగా వినియోగించుకోకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంటును కూడా విడుదల చేయలేదంటూ అక్షింతలు వేసింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం పదిహేనేళ్లుగా అమలవుతున్నా.. ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నంలో విఫలమైందని వ్యాఖ్యానించింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక వసతులు కల్పించలేదని విమర్శించింది. వరంగల్ జిల్లాలో రూ. 60.27 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, సైడు కాలువలు నిర్మించాల్సి ఉన్నా.. మార్గదర్శకాలు లేవంటూ కేవలం రూ. ఆరు లక్షలు మాత్రమే ఖర్చు చేశారని కాగ్ పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలో పారిశుధ్యం కోసం 1.26 కోట్లు కేటాయిస్తే.. అందులో 51.06 లక్షలతో సైకిల్ రిక్షాలు, 25 వేల చెత్తకుండీలు కొన్నారేగాని వాటి పంపిణీ పూర్తి చేయలేదని తప్పుబట్టింది. మంచినీరు, పారిశుధ్య మిషన్‌కు నిధులు వచ్చిన పక్షం రోజుల్లోగా అమలు సంస్థలకు నిధులు పంపిణీ చేయాలని కేంద్ర మార్గదర్శకాలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10 నెలల వరకు ఆ నిధులు విడుదల చేయలేదని పేర్కొంది. -
ఆందోళనలో అన్నదాత !
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్య వైఖరి, పాలకుల పట్టించుకోనితనం రైతుల పాలిట శాపంగా మారింది. ఎంతో ఆశతో వేసుకున్న పంటలన్నీ ఎండిపోతుండగా.. పొలాలన్నీ నెర్రెలిచ్చినీటికోసం నోరెళ్లబెడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నా.... ప్రధాన కాలువలకు ఇంకా నీరు పూర్తిగా చేరకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించింది. పది రోజులుగా వర్షాలు ముఖం చాటేయటంతో పాటు కాలువల ద్వారా నీరు అందుబాటులోకి రాకపోవటంతో నారుమడులు, వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు వేసిన పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. ఎగువన ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ నిండినా డెల్టాను సాగునీటి కొరత వెంటాడుతూనే ఉంది. రెండురోజుల క్రితం కాలువలకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నా....నీరు కంకిపాడు లాకుల వరకు వచ్చి ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఈ లాకుల వద్ద గుర్రపుడెక్క పేరుకుపోవటంతో దిగువకు నీరు పారడం లేదు. కాలువల్లో పూర్తిగా నీరున్నట్లు కనపడుతున్నాయి. అయితే కాలువల్లో ఉన్న నీరు పొలాల్లోకి వెళ్లే స్థాయికి నీటి మట్టం చేరుకోలేదు. దీంతో రైతులు నారుమడులను దక్కించుకునేందుకు ఆయిల్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. బందరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీటిని సరఫరా చేసే నాగులేరు కాలువపై మల్లవోలు వద్ద లాకులున్నాయి. ఈ లాకుల వద్ద నీటి మట్టం 240 సెంటీమీటర్లకు చేరితే దిగువకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. శనివారం సాయంత్రానికి కూడా ఇక్కడ నీటి మట్టం 170 సెంటీమీటర్లుగానే ఉంది. ఈ నీటి మట్టం పెరగాలంటే మరో రెండు రోజులు పడుతుందని నీటిపారుదలశాఖ సిబ్బంది చెబుతున్నారు. దివిసీమ కష్టాలు తీరెదెప్పుడో ... దివిసీమలోని కోడూరు మండలంలో కాలువల శివారు ప్రాంతాల్లో ఉన్న లింగారెడ్డిపాలెం, పోటుమీద, సాలెంపాలెం, రామకృష్ణాపురం, హంసలదీవి, పిట్టల్లంక, మందపాకల తదితర గ్రామాలకు శనివారం నాటికి కూడా సాగునీరు చేరలేదు. రామకృష్ణాపురంలో గత ఖరీఫ్‌లోనే సాగునీరు అందుబాటులో లేకపోవటంతో 700 ఎకరాల్లో సాగును రైతులు వదిలేశారు. ఈ ఏడాది ఇంత వరకు కాలువ ద్వారా నీరు రాకపోవటంతో ఖరీఫ్ సాగు చేయాలా వద్దా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. కృత్తివెన్ను మండంలోని లక్ష్మీపురం, గరిసిపూడి, పెదగొల్లపాలెం, మునిపెడ, నీలిపూడి, కొమాళ్లపూడి తదితర గ్రామాలకు ఇంకా సాగునీరు చేరనేలేదు. లక్ష్మీపురం లాకుల వద్ద 4.5 అడుగుల నీటి మట్టం ఉంటే శివారు ప్రాంతాలకు సాగునీరు చేరుతుంది. శనివారం నాటికి రెండు అడుగులు మాత్రమే నీటి మట్టం ఉంది. బంటుమిల్లి మండలంలోని ముంజులూరు, పాశ్చాపురం, నాగేశ్వరరావుపేట, మల్లేశ్వరం తదితర గ్రామాలకు సాగునీరు ఇంకా చేరలేదు. కమలాపురం లాకుల వద్ద 5.5 అడుగుల నీటి మట్టం ఉంటే ఈ గ్రామాలకు నీరు చేరుతుంది. ప్రస్తుతం అక్కడ రెండున్నర అడుగుల నీటి మట్టం కూడా లేదని రైతులు చెబుతున్నారు. కాలువలో ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా మళ్లిస్తున్నారు.