ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి | Asha workers to solve the problems in that government's negligent | Sakshi
Sakshi News home page

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

Published Thu, Sep 24 2015 11:38 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి - Sakshi

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

దుబ్బాక: ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందంటూ ఆశ వర్కర్లు   గురువారం దుబ్బాకలో సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని వారు ధ్వజమెత్తారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు  సమ్మెను విరమించబోమని హెచ్చరించారు.
 
ఉపకార వేతనాలను విడుదల చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ:
ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం తార డిగ్రీ కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మకు ఉరి వేసి నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ అనిల్‌రెడ్డి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను వారి పిల్లలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయీంబర్స్‌మెంటు, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో నగర కార్యదర్శి నెహ్రూ, నాయకులు అశోక్, సంగమేశ్వర్, నరేష్, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement