Workers hope
-
గాయపడ్డ ఆశ
కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఆశ కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యం, 64 మంది అరెస్టు, సొంత పూచీకత్తుపై విడుదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ విశాఖపట్నం: ఆశ వర్కర్లు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారి తీసింది. కలెక్టరేట్ ప్రాంతమంతా యుద్ధకాండను తలపించింది. ఆందోళన చేసిన ఆశ వర్కర్లను పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మూడు రోజులుగా రిలే నిరశన దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆశవర్కర్లు తమ ఆందోళనను శుక్రవారం ఉధృతం చేశారు. ఆశావర్కర్లు ముట్టడి చేస్తారని ముందుగానే గ్రహించిన పోలీసులు కలెక్టరేట్ చుట్టూ భారీగా మోహరించి కలెక్టరేట్ చుట్టూ ముళ్ల కంచె అమర్చారు. అయినా ఆశ కార్యకర్తలు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు ఆగకుండా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించటంతో వీరికీ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో కొందరు గాయాల పాలవగా, మరికొందరు ఎండకు సొమ్మసిల్లి పడిపోయారు. సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆశావర్కర్లు కలెక్టరేట్ గేట్ ముందు బైటాయించారు. కలెక్టర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పదేళ్లుగా ఆశ వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదని, మూడేళ్లుగా యూనిఫామ్ అలవెన్స్‌లు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేస్తున్న ఆశవర్కర్లకు గత 20 ఏళ్లుగా రూ.400 వేతనం మాత్రమే ఇస్తున్నారని ఆవేదన చెందారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 64 మంది అరెస్టు ఆశ వర్కర్ల నినాదాలతో ఫోర్త్‌టౌన్ మిన్నంటింది. తమ డిమాండ్ల సాధనకై శుక్రవారం కలెక్టరేట్‌వద్ద ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 64 మందిని ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో కూడా నినాదాలు చేయడంతో హోరెత్తింది. వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడిచిపెట్టారు. -
ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి
దుబ్బాక: ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందంటూ ఆశ వర్కర్లు గురువారం దుబ్బాకలో సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని వారు ధ్వజమెత్తారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని హెచ్చరించారు. ఉపకార వేతనాలను విడుదల చేయాలి సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం తార డిగ్రీ కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మకు ఉరి వేసి నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ అనిల్‌రెడ్డి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను వారి పిల్లలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయీంబర్స్మెంటు, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నెహ్రూ, నాయకులు అశోక్, సంగమేశ్వర్, నరేష్, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం