వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
Published Sat, Jul 22 2017 11:28 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. విశాఖ జిల్లా వెల్లంకి సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రోడ్డు పక్కన బైక్ ఆపి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ గడిగుంట్ల కిషోర్(38)గా గుర్తించారు. ఇదిలా ఉండగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సబితం గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో-బైక్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో చందంపల్లి గ్రామానికి చెందిన జాపతి సంపత్(34) మృతి చెందాడు.
Advertisement
Advertisement