ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్‌ | 5 bangladeshi peoples arrested in tiruvuru | Sakshi
Sakshi News home page

ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్‌

Published Wed, Jul 19 2017 7:53 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

5 bangladeshi peoples arrested in tiruvuru

చెన్నై: తమిళనాడు, తిరుపూర్‌లో అక్రమంగా నివసిస్తున్న ఐదుగురు బంగ్లాదేశ్‌ వాసులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో జరుగుతున్న పలు నేరాలలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరస్థులు తరచుగా పట్టుబడుతున్నారు. దీంతో సరైన ఆధారాలు లేకుండా నివసిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ఈ నేపథ్యంలో తిరుపూరులో పని చేస్తున్న బనియన్ల కంపెనీలలో వేల సంఖ్యలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో పని చేస్తున్నారు. తిరుపూర్‌ రామ్‌నగర్‌లో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఐదుగురు బస చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమానితుల వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహ్మద్‌బాబు (27), మహ్మద్‌ మమున్‌ (22), రసూన్‌మల్‌ సర్ధార్‌ (22), మహ్మద్‌ సహాదత్‌ (28), ఆసిక్‌ (20)గా గుర్తించారు. వారి నుంచి నకిలీ ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement