
సాక్షి, తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 38 గంటల్లో ఛేదించారు. కేసు వివరాలను డీఎస్పీ బి.శ్రీనివాసులు శనివారం మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన మొబైల్ షాప్ యజమాని భార్యను కత్తితో బెదిరించి బ్యాగులో ఉన్న రూ.57 వేల నగదుతో ఉడాయించిన నిందితులను తిరువూరు బస్టాండ్ సెంటర్‌లో అరెస్ట్ చేశామని తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని ముంబై, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామని పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తునట్లు డీఎస్పీ వెల్లడించారు.