63 మంది విద్యార్థులకు అస్వస్థత
Published Sat, Mar 11 2017 3:00 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అన్నపురెడ్డిపల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనంలో వంకాయ కూర, సాంబారు, మజ్జిగ వడ్డించారు. తెల్లవారేసరికి 63 మంది విద్యార్థులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 16 మందిని కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. మిగిలినవారికి యర్రగుంట పీహెచ్‌సీలో చికిత్స చేశారు. అస్వస్థతకు గురైనవారిలో 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు అస్వస్థతతోనే ఈ రోజు పరీక్ష రాశారు. పాఠశాలలో మొత్తం 610 మంది విద్యార్థులు ఉన్నారు. చండ్రుగొండ ఎస్సై, వైద్య సిబ్బంది పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు.
Advertisement