
జిల్లాకు 689 మంది పోలీసులు
పోలీస్‌స్టేషన్లు, ట్రాఫిక్ సమస్యలు, సిరిసిల్ల
త్వరలోనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
నేరాలను నియంత్రిస్తాం
ట్రాఫిక్ సమస్యలు అధిగమిస్తాం
ఐజీ వై.నాగిరెడ్డి వెల్లడి
సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్, క్రైం, ఎస్‌బీ, డీసీఆర్‌బీ, సీసీఎస్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఐజీ వై.నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్, ఎస్పీ కార్యాలయం, పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. జిల్లాకు 689 మంది పోలీసులను కేటాయించామని, గతంలో 256 మంది ఉండేవారన్నారు. మిగతా వాటి మాదిరిగానే ఇక్కడ కూడా ఆర్మీ రిజర్వుడు పోలీసు ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్మిక క్షేత్రంలో నేరాల సంఖ్య అధికమని, దీనిని నియంత్రిస్తామని ఐజీ చెప్పారు. సిరిసిల్లతోపాటు వేములవాడల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నా త్వరలోనే నియంత్రణలోకి తెస్తామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు సామాజిక కార్యక్రమాల్లోనూ పోలీసులు భాగస్వాములు అవుతారని ఆయన చెప్పారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానం, తాడూరులోని బీఈడీ కళాశాలను ఐజీ సందర్శించారు. ఆయ న వెంట ఎస్పీ విశ్వజిత్ కంపాటి, డీఎస్పీ పి.సుధాకర్, సీఐలు జి.విజయ్‌కుమార్, సీహెచ్ శ్రీధర్, పోలీసులు సిబ్బంది ఉన్నారు.