భివండీ, న్యూస్‌లైన్: క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని నగరంలో 87 డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు భద్రతలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక డ్రైవ్‌లో పోలీసులు బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం ఉదయం ఒంటి గంట వరకు నిర్వహించిన డ్రైవ్‌లో 1,345 మంది హెల్మెట్ ధరించని వారిపై, అదేవిధంగా అనధికారికంగా పార్క్ చేసిన 5,500 వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, సంవత్సరాది రోజు ట్రాఫిక్ సమస్యలను అరికట్టేందుకు నాకాబంది పాయింట్లను మరింతగా పెంచనున్నట్లు డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ప్రతాప్ దిగావ్కర్ తెలిపారు. మెరిన్‌డ్రైవ్, వర్లీ సీఫేస్, బాంద్రాలో ఉన్న కార్టర్ రోడ్డు వద్ద కూడా వాహనాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటుచేస్తామని ఆయన వివరించారు.
క్రిస్మస్ నాడు 87 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Published Fri, Dec 26 2014 10:05 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement