బస్సులో మహిళ ప్రసవం | A woman on the bus, delivery | Sakshi
Sakshi News home page

బస్సులో మహిళ ప్రసవం

Published Tue, Nov 19 2013 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM

A woman on the bus, delivery

బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సులో సోమవారం మధ్యాహ్నం గౌరమ్మ అనే మహిళ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాలూకాలోని హరగినడోణి గ్రామానికి చెందిన యన్నప్ప, బెంకమ్మ దంపతుల కుమార్తె గౌరమ్మకు పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరేందుకు సోమవారం తమ గ్రామం నుంచి బళ్లారికి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.

 వారు ప్రయాణిస్తున్న బస్సు నగర శివార్లలోని బెళగల్లు క్రాస్ వద్దకు చేరుకునేటప్పటికి ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమై విలవిలలాడుతుండటంతో బస్సును ఆపి ప్రయాణికులందరినీ దింపేశారు. అదే ప్రాంతంలో ఉన్న ఓ మంత్రసాని సహాయంతో ఆమె బస్సులోనే పండంటి మగబిడ్డను ప్రసవించింది. వెంటనే  108కి ఫోన్ చేయడంతో అంబులెన్స్ సహాయంతో తల్లీబిడ్డలను విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బిడ్డ 2.5 కిలోల బరువు ఉన్నాడని, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు విమ్స్ వైద్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement