తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్‌టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ)గా పనిచేస్తున్న అప్పారావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.
రూ.1.50 లక్షల నగదు, అరకేజీ బంగారు ఆభరణాలు, 70 లక్షల రూపాయలకు చెందిన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడతో పాటు ఏలూరు తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని భావిస్తున్నారు. కాకినాడ ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.