
పవిత్ర ప్రేమకు అడ్డురాదు అందం
పవిత్ర ప్రేమకు అందం, కులం, మతం ఏవీ అడ్డురావు అనడానికి ఈ చిత్రమే నిదర్శనం. సొనాలీ ముఖర్జీకి 18 ఏళ్ల వయసున్నప్పుడు (2003) ముగ్గురు దుండగులు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. మెరుగైన వైద్యం కోసం ఆమె తల్లిదండ్రులు భారీగా ఖర్చు చేసినా పూర్తి ఫలితం దక్కలేదు. ఫేస్‌బుక్ ద్వారా పరిచమైన చిత్తరంజన్ తివారీకి ఆమె ధైర్యసాహసాలు నచ్చి ఆయనే తొలత పెళ్లి ప్రతిపాదన తెచ్చారు. అతి కష్టం కొద్ది తివారీ తన తల్లిదండ్రులను ఒప్పించి ఏప్రిల్ 14న పెద్దల సమక్షంలో వివాహమాడారు.