
సీనియర్ నటుడు, దర్శకుడు మృతి
చెన్నై: తమిళ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్ హఠాన్మరణం చెందారు. శుక్రవారం కోయంబత్తూరులోని నివాసంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, దారి మధ్యలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 62 ఏళ్ల బాలు ఆనంద్కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బాలు ఆనంద్ దాదాపు 100 సినిమాల్లో నటించారు. కొన్ని తమిళ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. పిస్తా, అన్నానగర్ ఫస్ట్ స్ట్రీట్, అన్బె శివమ్, ననె రాజ నానె మంత్రి తదితర సినిమాల్లో నటించారు. బాలు ఆనంద్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.