Tamil actor and director
-
వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లే: నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: పుస్తకావిష్కరణ వేదికగా సినీ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ నోరు జారి వార్తల్లోకి ఎక్కారు. విమర్శలు, ఎదురు దాడి పెరగడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి వచ్చింది. బుధవారం మోదీ సంక్షేమ పథకాలు, నవభారతం –2022 పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు భాగ్యరాజ్ పాల్గొని సినీ స్టైల్లో డైలాగుల్ని పేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లేనని ఎద్దేవా చేశారు. నెల తక్కువగా పుట్టిన వాళ్లను, ప్రత్యేక ప్రతిభావంతుల్ని గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారనే ప్రచారంతో సామాజిక మాధ్యమాల్లో భాగ్యారాజ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన భాగ్యరాజ్ ‘తాను బీజేపీ వ్యక్తిని కాదని...తమిళుడిని అని వ్యాఖ్యానించారు. నెల తక్కువ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, తాను దురుద్దేశంతో ఆ వ్యాఖ్య చేయలేదని, ప్రసంగ వేగంలో ఆ పదాన్ని ఉపయోగించినట్టుగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చదవండి: నాన్న చేసిన పనికి కన్నీళ్లొచ్చాయి ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం -
ఆసుపత్రిలో ప్రముఖ తమిళ నటుడు
సాక్షి, చెన్నై : ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు రామరాజన్ (60) శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కరోనా బారినపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే రామరాజన్ ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారంలో ఉంది. కొన్నిరోజుల క్రితం ఆయన నివాసానికి ఏసీ మెకానిక్ వచ్చాడని, ఆ తర్వాత రామరాజన్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే కరోనా పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ కరోనా నెగిటివ్ అని తేలితే కొద్దిరోజుల్లోనే రామరాజన్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. (అనారోగ్య సమస్యలతో బాబు శివన్ మృతి) మక్కల్ నాయగన్ సినిమాతో నటుడిగా తమిళ చిత్రరంగంలో ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఎంగా ఓరు పాతుకుకరన్, కరాగట్టకరన్, ఎంగా ఓరు కావల్కరన్ మరియు పాతుకు నాన్ ఆదిమై వంటి సినిమాల్లో రామరాజన్ నటనకు మంచి గుర్తింపు లభించింది. దాదాపు 10 చిత్రాలకు దర్శకత్వం వహించిన రామరాజన్ ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలనే తెరకెక్కించారు. చివరిసారిగా 2012లో మేధై చిత్రంలో నటుడిగా కనిపించారు. అటు దర్శకత్వం, ఇటు నటనారంగంతో మమేకమైన రామరాజన్ తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు. త్వరలోనే నటుడిగా మరో మంచి చిత్రంతో కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి. (త్వరగా కోలుకుని మా ఇంటికి రండి) -
దర్శకుడు విస్సు ఇకలేరు
ప్రముఖ తమిళ దర్శకుడు విస్సు(74) ఇక లేరు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నై దురైపాక్కంలోని స్వగృహంలో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. 1981లో దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు విస్సు. ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వం వహించిన ‘తిల్లుముల్లు’ చిత్రానికి కథారచయితగా పరిచయమయ్యారు. ‘కణ్మణి పూంగా’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు విస్సు. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఆడదే ఆధారం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఎస్పీ ముత్తరామన్ దర్వకత్వం వహించిన ‘కుడుంబం ఒరు కడంబం’ అనే సినిమాతో నటుడిగానూ మారారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలతో కలిసి పనిచేశారాయన. ‘అరుణాచలం’ సినిమాలో రంభ తండ్రిగా చేసిన రంగాచారి పాత్ర ఆయనకు మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది. కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరనే పేరు పొందారాయన. ఆయన దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సంసారం అదు నిన్‌సారం’కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సంసారం ఒక చదరంగం’ పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో విస్సు చేసిన పాత్రనే తెలుగులో గొల్లపూడి మారుతీరావు చేశారు. విస్సు మృతికి తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. విస్సుకి భార్య ఉమ, కుమార్తెలు లావణ్య, సంగీత, కల్పన ఉన్నారు. -
సీనియర్ నటుడు, దర్శకుడు మృతి
చెన్నై: తమిళ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్ హఠాన్మరణం చెందారు. శుక్రవారం కోయంబత్తూరులోని నివాసంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, దారి మధ్యలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 62 ఏళ్ల బాలు ఆనంద్‌కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలు ఆనంద్ దాదాపు 100 సినిమాల్లో నటించారు. కొన్ని తమిళ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. పిస్తా, అన్నానగర్ ఫస్ట్ స్ట్రీట్, అన్బె శివమ్, ననె రాజ నానె మంత్రి తదితర సినిమాల్లో నటించారు. బాలు ఆనంద్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.