బిజీ బిజీగా విజయ్ ఆదిక్ | Actor Vijay adik Busy busy | Sakshi
Sakshi News home page

బిజీ బిజీగా విజయ్ ఆదిక్

Published Mon, May 25 2015 2:08 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

Actor Vijay adik Busy busy

అర్హత, ఆసక్తి, నిరంతర ప్రయత్నంతో హీరో అయ్యానంటున్నారు వర్ధమాన నటుడు విజయ్ ఆదిక్. ఇటీవల విడుదలైన ఇరిడియం చిత్రం ద్వారా కథా నాయకుడిగా పరిచయమైన ఈయనను ప్రస్తుతం పలు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఆ సంగతేంటో ఆయన మాటల్లోనే కోవైకు చెందిన నేను బీఈ, ఎంబీఏ చదివాను. అయితే నటన అంటే చాలా ఆసక్తి. చాలా కాలంగా ప్రయత్నించి ఎట్టకేలకు ఇరిడియం చిత్రం ద్వారా నా కలను నిజం చేసుకున్నాను.
 
 ఈ చిత్రంలో లవర్‌బాయ్‌గా మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ చిత్రం చాలా అవకాశాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఎస్ ఆర్ సెల్వకుమార్ దర్శకత్వంలో నటుడు విజయకాంత్ అన్నయ్య కొడుకు రాజసిమ్మిన్ నిర్మిస్తున్న ఒరు కాదల్ ఒరు కల్యాణం చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాను. ఇదే దర్శకుడి తదుపరి చిత్రంలో హీరోగా నటించనున్నాను. అదే విధంగా దర్శకుడు వళ్లియూర్ నంబిరాజన్ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారు.  నటనంటే ఇష్టం. హీరో అయినా రెండవ హీరో అయినా పాత్రలో దమ్ముంటే నటించడానికి సిద్ధమేనని విజయ్ ఆదిక్ అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement