
మళ్లీ ఢిల్లీ ఎన్నికల బరిలో లిల్లీ
న్యూఢిల్లీ: మళ్లీ ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో హిజ్రా రమేష్‌కుమార్ లిల్లీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మంగోల్‌పురి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఇప్పుడు ‘ఇండియన్ బహుజన సమాజ్‌వాదీ శక్తి’ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. గెలుపోటములు తనకు ముఖ్యం కాదని, తన వర్గం గుర్తింపు కోసమే పోటీ చేస్తున్నాని ఆమె పేర్కొన్నారు. ‘‘ప్రతిసారీ పురుషుడికో లేక మహిళకో అవకాశం ఇస్తున్నారు.
ఈ సారీ నాకు అవకాశం ఇవ్వండి. ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన పిల్లలు, బంధువుల కోసమే పని చేస్తాడు. నాకు ఎవ్వరూ లేరు. మధ్యతరగతి, పేద ప్రజల కోసం నేను పని చేస్తాను’’ అంటూ ఆమె ప్రచారం చే స్తున్నారు. ఈ సారి ఢిల్లీ ఎన్నికల బరిలో 673 మంది నిలవగా రమేష్‌కుమార్ ఒక్కడే హిజ్రా.