నగరవాసులకు బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్ | Buy One-Get One Free offer to residents | Sakshi
Sakshi News home page

నగరవాసులకు బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్

Published Fri, Jan 30 2015 11:59 PM | Last Updated on Fri, Apr 26 2024 7:25 PM

Buy One-Get One Free offer to residents

ఎన్నికల ప్రచారసభలో బీజేపీ మాజీ ఎంపీ సిద్ధూ
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలో ఉన్నందువల్ల నగరవాసులు ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీని ముఖ్యమంత్రిని చేయగలిగితే వారికి  బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్ దక్కినట్టేనని బీజేపీ మాజీ ఎంపీ సిద్ధూ పేర్కొన్నారు. పశ్చిమఢిల్లీలోని తిలక్‌నగర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న సందర్భంగా స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మీరు ప్రధానిగా మోదీని ఎన్నుకున్నారు.

ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కిరణ్‌బేడీని ఎన్నుకోండి. బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఇదే’ అని అన్నారు. ఇక ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులపాలన గురించి ప్రస్తావిస్తూ సింహాన్ని బదులు కోతిని ఎన్నుకుంటే అన్నీ ఇటువంటివే జరుగుతాయన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా నగరవాసులకు ఆప్ ఇస్తున్న  విద్యుత్, తాగునీటి చార్జీల తగ్గింపు, ఉచిత వైఫై తదితర హామీల సాధ్యాసాధ్యాలపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

‘ఇందుకు నిధులు ఎక్కడినుంచి వస్తాయి. ఇంటి కిరాయే చెల్లించలేని కేజ్రీవాల్ డబ్బు ఎక్కడినుంచి తీసుకొస్తారు’ అంటూ నిలదీశారు. ఈ ఎన్నికలు మంచికి, చెడుకు మధ్య జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ నగరం దేశానికి గుండె వంటిదని అభివర్ణిస్తూ ఈ నగర అభివృద్ధి చెందడమనేది దేశాభివృద్ధికి అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ అనురాగ్‌ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement