అవి..ఎల్‌ఈడీ రథాలు
Published Fri, Apr 1 2016 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM
సాక్షి, చెన్నై : నోట్ల కట్టలతో వచ్చినట్టుగా ఆరోపణలకు దారి తీసిన కంటైనర్లు ఎల్‌ఈడీ స్ర్కన్‌లతో కూడిన ప్రచార రథాలుగా తేలాయి. ఇదే విషయాన్ని స్ప ష్టం చేస్తూ కాంచీపురం జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి చిట్ల పా క్కం రాజేంద్రన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తక్షణం స్పం దించారు. ఆధార రహిత ఆరోపణలు చేసిన ఎండీఎంకే నేత వైగో, డీఎంకేకు చెందిన చానల్ పై కేసుల్ని ఆగమేఘాలపై నమో దు చేసి విచారణ చేపట్టారు. ఇక, వదంతులు, పుకార్లు, ప్రచారాల ఆధారంగా తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ సిరుదావూర్ వ్యవహారంలో స్పందించారు.
కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని సిరుదావూర్ బంగళ్లాలో కో ట్లాది రూపాయల నగదు దాచి పెట్టినట్టు, కంటైనర్ల ద్వారా వాటిని రాష్ర్టంలోని నియోజకవర్గాలకు తరలించే వ్యూహంతో అన్నాడీఎంకే ఉన్నట్టుగా పుకార్లు బయలు దేరిన విషయం తెలిసిందే. డీఎంకేకు చెందిన ఓ చానళ్ అక్కడి దృశ్యాల్ని పదే పదే ప్రసారం చేయడంతో చర్చ బయలు దేరింది. ఆ బంగళాకు వెనుక వైపుగా ఉన్న లారీలను చూపిస్తూ నగదు తరలించే యత్నంలో ఉన్నట్టుగా కథనాల్ని ప్రసారం చేశారు. ఇక, ఎండీఎంకే నేత వైగో తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
ఒక్కో నియోజకవర్గానికి రూ. పది కోట్లు వెచ్చించేందుకుగాను, అక్క డి రహస్య గదుల్లో రూ. 2,340 కోట్లు దాచి పెట్టినట్టుగా ఆరోపణలు చేశారు. దీంతో అప్పుడప్పుడు సీఎం జయలలిత విశ్రాంతి తీసుకునే సిరుదావూర్ బంగళా వార్తల్లోకి ఎక్కింది. ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి ఫిర్యాదుల రూపంలో చేరింది. అయితే, అవి కంటైనర్ లారీలు కావు అని, తమ ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో కూడిన ప్రచార రథాలుగా పేర్కొంటూ, తమ అమ్మ మీద ఆరోపణలు గుప్పించిన వారిపై పోలీసు స్టేషన్‌లో కాంచీపురం జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి చిట్ల పాక్కం రాజేంద్రన్ ఫిర్యాదు చేశారు.
కేసుల నమోదు :
సిరుదావూర్ బంగళాలకు విశ్రాంతి నిమిత్తం సీఎం జయలలిత వస్తుంటారని,అ యితే, ఆ బంగళా ఆమెకు సొంతం కాదని తన ఫిర్యాదులతో చిట్ల పాక్కం వివరించారు. అయితే, ఆమె పరువుకు భంగం కల్గే విధంగా ఆధార రహిత ఆరోపణలను ఎండీఎంకే నేత వైగో, డీఎంకే అనుకూల ఓ తమిళ న్యూస్ ఛానల్ వ్యవహరించాయని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. అలాగే, వారు ఆరోపిస్తున్న కంటైనర్ల తరహా లారీ వాహనాలు ఎంఏబీఐఎస్ శాట్ కామ్ సంస్థ నుంచి అద్దెకు రప్పించినట్టు వివరించారు. ఆ వాహనాలు ఎల్‌ఈడీ స్కీన్లతో కూడిన తమ ప్రచార రథాలు అని, అయితే, ఆధార రహిత ఆరోపణలతో అందర్నీ తప్పుదోవ పట్టించడంతో పాటుగా తమ అమ్మ పరువుకు భంగం కల్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదుతో పోలీసులు తక్షణం స్పందించారు. ఎండీఎంకే నేత వైగో, ఆ న్యూస్ చానల్‌పైకేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. చర్యలు తీసుకోలేం : సిరుదావూర్ బంగళా మీద వస్తున్న ఆరోపణల మీద ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్‌లఖానీ స్పందించారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఎన్నికల అధికారుల సమావేశానికి లఖాని హాజరు అయ్యారు. రాష్ట్రంలో సాగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ఢిల్లీ వర్గాలకు వివరించారు. ముందుగా చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
సిరుదావూర్ బంగళా వ్యవహారాన్ని ప్రస్తావించగా, వదంతులు, పుకార్లు, ప్రచారాల ఆధారంగా తాము చర్యలు తీసుకోలేమని వ్యాఖ్యానించారు. డీఎంకే నుంచే కాదు, ఇతర పార్టీల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిరుదావూర్ వ్యవహారంపై కాంచీపురం జిల్లా కలెక్టర్, ఎస్పీలు విచారణ జరుపుతున్నారని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 16 కోట్ల మేరకు నగదు తనిఖీల్లో పట్టుబడ్డాయని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తిరుచ్చి సమీపంలో చెత్త కుప్పలో దర్శనం ఇచ్చిన నోట్ల కట్టలకు బ్యాంకుల్లో ఉపయోగించే లేబుల్స్ వ్యవహారంపై కూడా విచారణ వేగవంతం చేసి ఉన్నామన్నారు.
Advertisement