తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలో అన్నాడీఎంకే నేత అరుణాచలేశ్వరాలయం ముందు హత్యకు గురయ్యాడు. తిరువణ్ణామలై సన్నది వీధికి చెందిన కనకరాజ్(50) తిరువణ్ణామలై అన్నాడీఎంకే మాజీ పట్టణ కార్యదర్శిగా ఉండేవారు. ప్రస్తు తం తిరువణ్ణామలై కోఆపరేటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. 18 సంవత్సరాల పాటు అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శిగా వ్యవహరిస్తూ గత మేలో పదవి పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కనకరాజ్ తిరువణ్ణామలైలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బాడ్మింటన్ ఆడేందుకు స్నేహితుడు కన్నదాసన్ బైక్‌లో వెళ్లా డు. అన్నామలైయార్ ఆలయం తిరుమంజన గోపురం దారిలో వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు అతివేగంగా బైక్‌ను ఢీకొంది. దీంతో బైకులో వెళుతున్న కనకరాజ్, కన్నదాసన్ కింద దిగి కారులో ఉన్న వ్యక్తులతో వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాప్ వేసుకుని వచ్చి కత్తితో కనకరాజ్‌పై దాడి చేసి గాయపరిచారు. దీనిని గమనించిన కన్నదాసన్ పరారయ్యారు.
దాడిలో కనకరాజ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందారు. తిరువణ్ణామలై పోలీస్‌స్టేషన్ కు ఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టేందుకు వెళ్లారు. అ ప్పటికే హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు పోలీస్‌స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల వద్ద విచారణ జరపగా తిరువణ్ణామలై గాంధీనగర్ మూడవ వీధికి చెందిన నటరాజన్ కుమారుడు బంక్ బాబు, పాత కార్‌కాన వీధికి చెందిన పరశురామన్ కుమారుడు రాజ, ఆర్ముగం కుమారుడు శరవణన్ అని తెలిసింది.
ఇదిలా ఉండగా తిరువణ్ణామలైలో పలు కోట్ల విలువ చేసే స్థలాన్ని కనకరాజ్ కబ్జా చేసి మోసం చేసినట్లుగా దీంతోనే తమకు కనకరాజ్‌కు పాతకక్షలు ఉన్నట్లు నిందితులు పోలీసుల వద్ద తెలిపారు. దీంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా గత వారంలో అన్నామలైయార్ ఆలయ కుంభాభిషేకం జరిగిన నేపథ్యంలో మాడ వీధుల్లో నమోదు చేసిన కెమెరాలు అలాగే ఉండడంతో హత్య జరిగిన ప్రాంతంలో పూర్తిగా నమోదు కావడంతో ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.