మద్యనిషేధం అమలు చేయూలి
Published Wed, Feb 5 2014 12:00 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
టీనగర్, న్యూస్‌లైన్:రాష్ట్రంలో టాస్మాక్ దుకాణాలు మూసివేసి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయూలంటూ ఎండీఎంకే సర్వసభ్య సమావేశంలో తీర్మానం చే శారు. చెన్నై వానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి కల్యాణ మండపంలో ఎండీఎంకే సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ప్రిసిడీయం చైర్మన్ దురైస్వామి దీనికి అధ్యక్షత వహించారు. సర్వసభ్య కమిటీ, కార్యవర్గ కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శులు సుమారు 1500 మంది పాల్గొన్నారు. ముందుగా ఈ సమావేశానికి ఉదయం 10.20 గంటలకు చేరుకున్న ప్రధాన కార్యదర్శి వైగోకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తర్వాత 10.30 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఎండీఎంకే సర్వసభ్య సమావేశంలో మొత్తం 17 తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ఈ సమావేశంలో తిరువళ్లూరు నగర కార్యదర్శి కేఎం వేలు, కే సెల్వపాండియన్, మైలై ఎస్ వెంకటేషన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య తీర్మానాలు.- పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తొలగించే విధంగా బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయూలి.
శ్రీలంకలో సాధారణ ఓటింగ్ జరపాలని, ఈ ఓటింగ్ ద్వారా శ్రీలంక తమిళులు, రాష్ట్రంలో గల ప్రత్యేక శిబిరాలలో నివసిస్తున్న తమిళులు ఓటు వేసేందుకు ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. కావేరి ట్రిబ్యునల్ తీర్పును అమలు జరిపేందుకు కావేరి మేనేజ్‌మెంట్ కమిటీ, కావేరి డిసిప్లినరీ కమిటీ వంటి ఇరు కమిటీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి.కేన్సర్ కారకంగా మారిన టాస్మాక్ దుకాణాలను మూసివేసి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదం అమలు జరపాలి.
Advertisement
Advertisement