సాక్షి, చెన్నై : స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని, నిధుల కొరత తాండవం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తిరునల్వేలిలో ఆదివారం జరిగి ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ వేడుకలో స్టాలిన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే, ప్రభుత్వ వర్గాల తీరుపై విరుచుకుపడ్డారు. పదవిని కాపాడుకునే ప్రయత్నాల్లో ప్రజల్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల రాబోతున్నదని జోస్యం చెప్పారు. ఎన్నికలు రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఇక, అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచిన విషయంగా ప్రత్యేక ప్రకటనతో అన్ని అంశాలను ఎత్తి చూపుతూ స్టాలిన్ వివరించారు. ఈ ప్రభుత్వం ఇటీవల అసెం బ్లీలో దాఖలు చేసిన అనుబంధ బడ్జెట్‌ను పరిశీలిస్తే, మూలధనం తగ్గదల, నిధుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక, నిధుల కొరతతో రేషన్ వస్తువుల కొనుగోళ్లలోనూ జాప్యం చేసి ఉండడం బట్టి చూస్తే, ఏ మేరకు రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందో స్పష్టం అవుతోందన్నారు.
అసెంబ్లీకి ఎన్నికలు తథ్యం
Published Mon, Mar 13 2017 2:40 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
Advertisement