బాల్కొండ: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను శనివారం మూసివేశారు. దీంతో ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటికి బ్రేకులు పడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉండాలి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక్కో గేటును క్రమంగా దించుతూ మొత్తం 14 గేట్లను మూసివేశారు.
బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం, దించడం త్రిసభ్య సమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరగాలన్న కోర్టు ఆదేశాల మేరకు.. ఎస్సారెస్పీ ఎస్‌ఈ సత్యనారాయణ, నాందేడ్ ఈఈ లవరాలే, సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్ సమక్షంలో గేట్లను మూసివేశారు. దీంతో, వచ్చే జూలై 1 వరకు బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి కానీ, ఎగువ ప్రాంతాల నుంచి కాని ఎస్సారెస్పీలోకి చుక్క నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
బాబ్లీ గేట్లు బంద్..
Published Sun, Oct 30 2016 11:33 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
Advertisement