అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు  | Bengaluru Is Most Traffic Congested City In The World | Sakshi
Sakshi News home page

అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు 

Published Thu, Jan 30 2020 7:09 AM | Last Updated on Thu, Jan 30 2020 7:14 AM

Bengaluru Is Most Traffic Congested City In The World - Sakshi

బెంగళూరు : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్‌ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఈమేరకు టామ్‌టామ్‌ (టామ్‌2) అనే సంస్థ ఓ నివేదిక వెల్లడించింది. 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్‌ పరిస్థితులపై టామ్‌టామ్‌ ట్రాఫిక్‌ ఇండెక్స్‌ పేరిట ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం బెంగళూరు వాసులు ట్రాఫిక్‌లో సగటున 71 శాతం ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపింది. బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 10 రోజుల 3 గంటల పాటు (243 గంటలు) ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు పేర్కొంది. టాప్‌–10 జాబితాలో  ముంబై, పుణే, ఢిల్లీ నగరాలు వరుసగా 4, 5, 8 స్థానాల్లో నిలిచాయి. ట్రాఫిక్‌ రద్దీ ముంబైలో 65 శాతంగా, పుణేలో 59 శాతంగా, ఢిల్లీలో 56 శాతంగా ఉంది. టాప్‌–10లో మనీలా (ఫిలిప్పీన్స్‌), బొగోటా (కొలంబియా), మాస్కో (రష్యా), లిమా (పెరు), ఇస్తాంబుల్‌ (టర్కీ), జకార్తా ( ఇండోనేసియా) ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement