TrafficJam
-
అధికారపార్టీలో వుంటేనే అర్హులు.. లెదంటే..
సూర్యాపేట: ఆత్మకూర్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో ఎన్నికలకు ముందు దళితబంధు లొల్లి మొదలైంది. అనర్హులకు ఇచ్చారంటూ ఏకంగా సర్పంచ్ ఇంటికే తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. నెమ్మికల్ గ్రామానికి 24 దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయని, వాటి ని మాదిగ సామాజిక వర్గానికి 12, మాల సామాజిక వర్గానికి 12 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యూనిట్ల పంపిణీ సక్రమంగా జరగలేదని దళితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆర్థికంగా బలంగా ఉన్న దళితులకు, ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికే ఈ పథకం మంజూరు చేశారని, ఇదే విషయమై బుధవారం ఎస్సీ వర్గానికే చెందిన గ్రామసర్పంచ్ గంపల సతీష్‌ను కొందరు ప్రశ్నించారు. ఈ సమయంలో సర్పంచ్ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహంతో దళితులు ఆందోళన చేశారు. దళిత బంధులో అక్రమాలు జరిగాయని గ్రామంలోని సూర్యాపేట – దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేసిన గోడ గడియారాలను తీసుకొచ్చి పగులగొట్టారు. గృహలక్ష్మి పొందిన వారే తిరిగి దళితబంధు తీసుకుంటున్నారని, నిజమైన నిరుపేద దళితులు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. ఉదయం 7గంటలకే రోడ్డు ఎక్కి 11గంటల వరకూ ఆందోళన విరమించకపోవడంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట్‌రెడ్డి ఆందోళన కారులకు నచ్చజెప్పినా వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగడంతో పాటు అతని కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. ఇదిలా ఉండగా అసలు మండలానికి దళితబంధు యూనిట్లు రాలేదని తెలుస్తోంది. కేవలం ఆ పార్టీకి చెందిన నాయకులు దళితబంధు మంజూరైందని చెప్పి దళితుల మెప్పుపొందేందుకు ప్రయత్నించారని, ఇది బెడిసి కొట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మండలంలో దళితబంధు ఊసెత్తని వారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మంజూరైందని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ మల్సూర్‌నాయక్‌ను వివరణ కోరగా తమకు దళితబంధు పథకంపై ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాస్తారోకో చేసి ప్రజారవాణాకు ఆటంకం కలిగించిన గంపల కరుణాకర్, గంపల లెనిన్, చంద్రు, పురం శివక్రిష్ణ, జానకిరాములు, గరిగంటి రాంబాబులతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. -
ఢిల్లీలో ట్రాఫిక్‌ను తపించుకునేందుకు ఆటో డ్రైవర్ ఎమ్ చేసాడో తెలుసా..!
-
అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు
బెంగళూరు : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఈమేరకు టామ్‌టామ్ (టామ్2) అనే సంస్థ ఓ నివేదిక వెల్లడించింది. 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరిట ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం బెంగళూరు వాసులు ట్రాఫిక్‌లో సగటున 71 శాతం ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపింది. బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 10 రోజుల 3 గంటల పాటు (243 గంటలు) ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు పేర్కొంది. టాప్–10 జాబితాలో ముంబై, పుణే, ఢిల్లీ నగరాలు వరుసగా 4, 5, 8 స్థానాల్లో నిలిచాయి. ట్రాఫిక్ రద్దీ ముంబైలో 65 శాతంగా, పుణేలో 59 శాతంగా, ఢిల్లీలో 56 శాతంగా ఉంది. టాప్–10లో మనీలా (ఫిలిప్పీన్స్), బొగోటా (కొలంబియా), మాస్కో (రష్యా), లిమా (పెరు), ఇస్తాంబుల్ (టర్కీ), జకార్తా ( ఇండోనేసియా) ఉన్నాయి. -
హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వాన
-
పుష్కర యాత్రికులతో ట్రాఫిక్‌జామ్
– పోలీసుల చొరవతో గేట్లు ఎత్తివేసిన సిబ్బంది – 2గంటల్లో దాటిన 10వేల వాహనాలు షాద్‌నగర్ : పుష్కర స్నానం కోసం వెళుతున్న ప్రయాణికుల వాహనాలకు టోల్గేట్ వద్ద బ్రేకులు పడ్డాయి. సుమారు రెండుగంటల పాటు వాహనదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రెండోరోజు శనివారం పుష్కర భక్తులు పెద్దఎత్తున తమ వాహనాల్లో పుష్కరస్నానం కోసం బయల్దేరారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్దకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాహనాలు వచ్చాయి. టోల్ రసీదులు జారీ చేస్తున్నా వాహనాల రాక ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో పట్టణ సీఐ రామకష్ణ అక్కడికి చేరుకుని అన్ని గేట్లను ఎత్తివేయించడంతో వాహనదారులు ఎలాంటి టోల్ రుసుము చెల్లించకుండానే వెళ్లిపోయారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే పదివేల వాహనాలు వెళ్లాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం షాద్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్లే దారిలో ఉన్న ఆరు, జడ్చర్ల నుంచి ౖహె దరాబాద్ వైపు వెళ్లే దారిలో ఉన్న రెండు టోల్ కౌంటర్ల ద్వారా యాత్రికులను జడ్చర్ల వైపు పంపారు. రద్దీ పెరిగే అవకాశం వరుసగా మూడురోజుల పాటు సెలవులు ఉండటంతో పుష్కర యాత్రికులు పెద్దఎత్తున బీచ్పల్లి, అలంపూర్ తదితర ఘాట్లకు తరలే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని క్రమబద్ధీకరించడానికి బైపాస్ జాతీయ రహదారిలో ఉన్న యమ్మీ హోటల్ సమీపంలో నుంచి చిల్కమర్రి మీదుగా బూర్గుల ఆపై తిరిగి జాతీయ రహదారికి వాహనాలను మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.