
ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఆపండి
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. మాల్యా దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించాలని బ్యాంకులు కోరాయి. ఎస్బీఐ, ఇతర బ్యాంకులు ఈ మేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. మాల్యా దేశం విడిచివెళ్లకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకులు కోరాయి. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశముంది.
సీబీఐ ఫిర్యాదు మేరకు మాల్యాపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాల్యా, ఐడీబీఐ అధికారులు కలిసి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.900 కోట్లు నష్టం కలిగించడానికి కారణమయ్యారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.