చెన్నై, సాక్షి ప్రతినిధి : అఖిలభారత బాంకు ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం తలపెట్టిన బ్యాం కుల సమ్మె విజయవంతమైంది. రాష్ట్రంలోని 6 వేల బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి.
రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీతాల పెంపును పూర్తిచేయాలని, ఐదు రోజుల పనిదినాలను ప్రవేశపెట్టాలని, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె పాటిం చారు. ఉన్నతాధికారి మొదలుకుని బంట్రోతు వరకు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకులన్నీ బోసిపోయూరుు. బ్యాంకుల్లో పూర్తిగా లావాదేవీలు స్తంభించిపోయా యి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉన్నవారికి మాత్ర మే వంటగ్యాస్ సబ్సిడీ సదుపాయం లభిస్తుందని కేంద్రం షరతు విధించింది. ఈనెలాఖరులోగా ఇందు కు అవసరమైన పనులు పూర్తిచేయాల్సి ఉండగా, దీంతో ఆధార్‌కార్డు నెంబర్లను బ్యాంకుల్లో రిజిస్టర్ చేసుకోలేక ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. తమిళనాడులో 6వేల శాఖలకు సంబంధించి 50 వేల మం ది, చెన్నైలో 1300 శాఖల్లోని 15 వేల మంది సమ్మెలో పాల్గొన్నారు.
4వ తేదీ వరకు దేశంలో సమ్మె
తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెను నాలు గు దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. తొలి దశగా మంగళవారం తమిళనాడుతోపాటు పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1.50 లక్షల మంది సమ్మెలో పాల్గొనగా 23 వేల బ్యాంకులు మూతపడ్డాయని ఆయన అన్నారు. ఈనెల 3వ తేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోనూ, 4వ తేదీన తుదిదశగా పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్, త్రిపుర రాష్ట్రాల్లో సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
బ్యాంకుల సమ్మె సక్సెస్
Published Wed, Dec 3 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement