Banks Strike
-
కస్టమర్లకు గమనిక: జనవరి 30, 31 తేదీల్లో యథావిధిగా బ్యాంకు సేవలు
సాక్షి,ముంబై: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ముంబైలో జరిగిన సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు జనవరి 30-31 తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. సమ్మె వాయిదా పడడంతో సంబంధిత తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. (అదానీకి మరో ఎదురుదెబ్బ: సెబీ కన్ను, మరింత లోతుగా పరిశీలన) ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్స్‌తో బ్యాంకు యూనియన్లు జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది. (అదానీ సెగ: ఎల్ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి) ఉద్యోగుల డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సమస్యలపై సంబంధిత అధికారులు, కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చించనున్నారు. -
రెండు రోజులు బ్యాంకులు బంద్! ఖాతాదారులపై సర్వీస్ చార్జీల భారం తగ్గించాలి..
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సేవలకు 28, 29 తేదీల్లో పాక్షిక అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, ఉద్యోగ ప్రతికూల ఆర్థిక విధానాలను నిరసనగా సోమ, మంగళవారాల్లో సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు బ్యాంక్ ఉద్యోగ సంఘాల్లోని ఒక వర్గం మద్దతునివ్వడం దీనికి కారణం. ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. కార్మిక చట్ట సంస్కరణలు, ప్రైవేటీకరణ, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంఎన్ఆర్ఈజీఏ కింద వేతనాల పెంపు, ఇతర కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ డిమాండ్లు ఇవీ.. బ్యాంకింగ్ రంగంలోని డిమాండ్లపై కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు మద్దతు ఇవ్వాలని, ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేసి వాటిని బలోపేతం చేయాలని, మొండిబకాయిల (ఎన్పీఏ) సత్వర రికవరీకి చర్యలు తీసుకోవాలని, ఖాతాదారులపై సర్వీస్ చార్జీల భారం తగ్గించాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని బ్యాంకు యూనియన్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం స్పష్టం చేశారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐసహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె కారణంగా తమ సేవలకు పాక్షిక అంతరాయం కలగవచ్చని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. బుధవారం కూడా... కాగా, బుధవారం కూడా కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. 2021–22కు సంబంధించి ప్రభుత్వ ఖాతా లావాదేవీల వార్షిక ముగింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించడం దీనికి నేపథ్యం. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే నిర్దిష్ట (ఏజెన్సీ) బ్యాంకు బ్రాంచీలు ఆయా లావాదేవీలను తప్పనిసరిగా అదే ఆర్థిక సంవత్సరంలో ముగించాల్సిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ ప్రత్యేక ఆదేశాలతో ఆర్థిక సంవత్సరం చివరిరోజు గురువారం నిర్దిష్ట బ్యాంక్ బ్రాంచీలు ప్రభుత్వ చెక్కుల క్లియరెన్స్‌ను చేపడతాయి. -
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! ఆగిపోనున్న బ్యాంకు కార్యకలాపాలు..!
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిసెంబర్ 16, 17వ తేదీన సమ్మెను చేపట్టనున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల కార్యాకలాపాలు రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో సుమారు తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్టొంటారు. ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులను అలర్ట్ చేశాయి. చెక్ క్లియరెన్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపనుంది. సమ్మెను విరమించండి..! రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలతో ఆయా బ్యాంకులు సమ్మెను విరమించాలని ఉద్యోగులను కోరాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వీటిని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునివ్వగా.. ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలమయ్యాయి. రెండు రోజులపాటు..! 2021-22 బడ్జెట్ సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రేవేటీకరణ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ వెల్లడించారు. అంతేకాకుండా బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు రుణ కేటాయింపులు ఇబ్బందికరంగా మారుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: రూ.15 వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారికి ఈపీఎఫ్ఓ శుభవార్త! -
రెండు రోజులు బ్యాంకుల సమ్మె.. ఎస్బీఐ రిక్వెస్ట్
SBI Statement On Two Days Bank Strike: పబ్లిక్ సెక్టార్‌లోని రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ United Forum of Bank Unions (UFBU) డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజులపాటు కార్యకలాపాలన్నీ ఆగిపోతాయని, సేవలు నిలిచిపోతాయని బ్యాంకులు కస్టమర్లకు అలర్ట్ సైతం జారీ చేశాయి. ఈ తరుణంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సమ్మెకు దూరం ఉండాలని తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది ఎస్బీఐ. సమ్మెలో పాల్గొనడంపై పునరాలోచించుకోవాలని, తద్వారా లావాదేవీలకు, ఇతర సేవలకు విఘాతం కలగకుండా చూడాలని కోరింది. ‘కరోనా సమయంలో సమ్మెల వల్ల సేవలకు విఘాతం కలుగుతుంది. ఈ స్ట్రయిక్ పట్ల బ్యాంక్, ఇన్వెస్టర్లు, ఖాతాదారులకు ఎలాంటి ఆసక్తి ఉండబోదు. ఈ రెండు రోజులపాటు బ్యాంకులు సాధారణంగానే పని చేస్తాయని, అయితే కస్టమర్లకు అందించే సేవలపై సమ్మె ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అని ప్రకటనలో పేర్కొంది ఎస్బీఐ. An appeal to all Bank Staff. pic.twitter.com/EZFGpfnK0a — State Bank of India (@TheOfficialSBI) December 13, 2021 ఈ నేపథ్యంలో కస్టమర్లను వీలైనంత మేర డిజిటల్ ట్రాన్జాక్షన్స్ వైపు మొగ్గు చూపాలని కోరింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ఈ రెండు రోజులపాటు అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని కస్టమర్లకు సూచించింది. అయితే ఏటీఎంలలో క్యాష్ పరిస్థితి గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చదవండి: బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం! -
బ్యాంకుల సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: మార్చి 11 నుంచి తలపెట్టిన మూడు రోజుల బ్యాంకుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. ఉద్యోగుల జీతాలు 15 శాతానికి పెంచడంతో పాటు ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించడంతో యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జీతాలు పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) అంగీకరించిందని, పనితీరు బాగున్న బ్యాంకుల్లో నిర్వహణ లాభాల్లో నాలుగు శాతాన్ని ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు ‘సాక్షి’తో చెప్పారు. ఐదు రోజుల పనిదినాలు తప్ప ఫ్యామిలీ పెన్షన్ దగ్గర్నుంచి అన్ని ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించడంతో సమ్మె వాయిదా వేసి చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. వేతన సవరణ కోసం జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దిగిరాకుంటే మార్చి 11 నుంచి మూడు రోజులు, ఆ తర్వాత నిరవధిక సమ్మె చేసేందుకు యూనియన్లు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. శనివారం యూనియన్లతో ఐబీఏ జరిపిన చర్చలు సానుకూలంగా ముగిసాయి. ఈ 15 శాతం వేతన పెంపుతో బ్యాంకులపై ఏడాదికి సుమారు రూ.8,000 కోట్ల భారం పడనుంది. అలాగే రూ.80,000 జీతం ఉన్న బ్యాంకు ఉద్యోగికి ఏడాదికి రూ.40 నుంచి రూ.50 వేల లాభం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఐబీఏ ప్రతిపాదనలను పరిశీలించి వారం తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని యూనియన్ నేతలు వివరించారు. -
ఈ నెల 8న బ్యాంక్‌లు, ఏటీఎమ్‌లు బంద్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌లు బంద్ చేపడుతున్నాయి. ఈ నెల 8న(బుధవారం) విధులకు రావొద్దని బ్యాంక్ యూనియన్లు ఉద్యోగులకు సూచించాయి. కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్ ఇండియా జనరల్ స్ట్రయిక్‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి. దీంతో సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకులపై పడనున్నాయి. బుధవారం రోజున బ్రాంచ్‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై కూడా చూపనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఈ సమ్మెకు ప్రభావితం కావు. స్ట్రయిక్ రోజు ఎలాంటి క్లరికల్ వర్క్‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించినట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా చెప్పారు. -
నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ: విజయ, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాయి. గత శుక్రవారం కూడా ఇదే అంశంతోపాటు వేతన డిమాండ్లపై ఒక రోజు సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు వారం తిరగక ముందే మరోసారి సమ్మెకు దిగుతున్నారు. దీంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకు సేవలపై ప్రభావం పడనుంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. చాలా వరకు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మె విషయమై సమాచారాన్ని కూడా తెలియజేశాయి. తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెను నిర్వహిస్తోంది. విలీనం విషయంలో ముందుకు వెళ్లబోమంటూ ప్రభుత్వం నుంచి తమకు హామీ రాలేదని, దాంతో సమ్మె నిర్ణయం తీసుకున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలియజేశారు. ప్రభుత్వం బ్యాంకుల సైజు పెరగాలని కోరుకుంటోందని, ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక్కటి చేసినా గానీ, ప్రపంచంలోని టాప్ 10లో చోటు దక్కదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. -
26న బ్యాంకుల సమ్మె
ప్రభుత్వ రంగంలోని మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా డిసెంబర్ 26న (బుధవారం) సమ్మెకు దిగనున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొననున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటు వేతనాల పెంపు డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్స్ శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 3.20 లక్షల మంది అధికారులు పాల్గొన్నారు. ఈ మూడు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్రం సెప్టెంబర్‌లో ప్రతిపాదించింది. అయితే, ఈ విలీనం వల్ల ఇటు బ్యాంకులకు గానీ అటు కస్టమర్లకు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, పైగా రెండు వర్గాల ప్రయోజనాలకు ప్రతికూలమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్ని స్తోందని, అయితే మొత్తం ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ కలిపేసినా టాప్ 10 గ్లోబల్ బ్యాంకుల్లో చోటు దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ తదితర 9 యూనియన్లు.. యూఎఫ్‌బీయూలో భాగం. -
బ్యాంకుల సమ్మె సక్సెస్
చెన్నై, సాక్షి ప్రతినిధి : అఖిలభారత బాంకు ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం తలపెట్టిన బ్యాం కుల సమ్మె విజయవంతమైంది. రాష్ట్రంలోని 6 వేల బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీతాల పెంపును పూర్తిచేయాలని, ఐదు రోజుల పనిదినాలను ప్రవేశపెట్టాలని, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె పాటిం చారు. ఉన్నతాధికారి మొదలుకుని బంట్రోతు వరకు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకులన్నీ బోసిపోయూరుు. బ్యాంకుల్లో పూర్తిగా లావాదేవీలు స్తంభించిపోయా యి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉన్నవారికి మాత్ర మే వంటగ్యాస్ సబ్సిడీ సదుపాయం లభిస్తుందని కేంద్రం షరతు విధించింది. ఈనెలాఖరులోగా ఇందు కు అవసరమైన పనులు పూర్తిచేయాల్సి ఉండగా, దీంతో ఆధార్‌కార్డు నెంబర్లను బ్యాంకుల్లో రిజిస్టర్ చేసుకోలేక ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. తమిళనాడులో 6వేల శాఖలకు సంబంధించి 50 వేల మం ది, చెన్నైలో 1300 శాఖల్లోని 15 వేల మంది సమ్మెలో పాల్గొన్నారు. 4వ తేదీ వరకు దేశంలో సమ్మె తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెను నాలు గు దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. తొలి దశగా మంగళవారం తమిళనాడుతోపాటు పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1.50 లక్షల మంది సమ్మెలో పాల్గొనగా 23 వేల బ్యాంకులు మూతపడ్డాయని ఆయన అన్నారు. ఈనెల 3వ తేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోనూ, 4వ తేదీన తుదిదశగా పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్, త్రిపుర రాష్ట్రాల్లో సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.